News
News
X

TSRTC Jobs: ఆర్టీసీలో అప్రెంటిస్‌ పోస్టులు, డిగ్రీ ఏదైనా సరే!

బీఈ, బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఇంజినీరింగ్ విభాగానికి; బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ వారు నాన్-ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 16లోపు తమ దరఖాస్తు చేసుకోవాలి.

FOLLOW US: 
Share:

తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో (టీఎస్‌ఆర్టీసీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఇంజినీరింగ్ విభాగానికి; బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ అర్హత ఉన్నవారు నాన్-ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 16లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు మొదట నేషనల్ అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలి. ప్రస్తుతానికి నాన్-ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను మాత్రమే అధికారులు విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రకటనలను త్వరలోనే విడుదల చేయనున్నారు. 


వివరాలు..

* అప్రెంటిస్ పోస్టులు

1) నాన్-ఇంజినీరింగ్ ఖాళీలు: 150

2) ఇంజినీరింగ్ ఖాళీలు: ప్రకటించాల్సి ఉంది.

అప్రెంటిస్ వ్యవధి: 3 సంవత్సరాలు.

రీజియన్లవారీగా నాన్-ఇంజినీరింగ్ ఖాళీలు: హైదరాబాద్-26, సికింద్రాబాద్-18, మహబూబ్ నగర్-14, మెదక్-12, నల్లగొండ-12, రంగారెడ్డి-12, ఆదిలాబాద్-09, కరీంనగర్-15, ఖమ్మం-09, నిజామాబాద్-09, వరంగల్-01.

అర్హత: బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ అర్హత ఉండాలి. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:  మెరిట్ ఆధారంగా.

స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్లపాటు స్టైపెండ్ అందజేస్తారు. మొదటి ఏడాది నెలకు రూ.15,000; రెండో ఏడాది నెలకు రూ.16,000, మూడో ఏడాది నెలకు రూ.17,000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.10.2022.

Non Engineering Notification

అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్
Website

దరఖాస్తు ఇలా..

Step1: మొదట https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step2:  అక్కడ హోంపేజీలో కనిపించే 'Register Here' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Step3:  క్లిక్ చేయగానే వచ్చే పేజీలో అభ్యర్థులు తమ వివరాలను నమోదుచేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

Step4: ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం వేచిచూడాల్సి ఉంటుంది.

Step5: వెరిఫికేషన్, అప్రూవల్ పూర్తయిన తర్వాత మళ్లీ https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step6: లాగిన్ ఆప్షన్‌ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్ కావాలి.

Step7: అనంతరం ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి.

Step8: తర్వాత ఫైండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.

Step9: తదుపరి టీఎస్ ఆర్టీసీ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.

Step10: అనంతరం అప్లయ్‌ బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.


Also Read:

SSC Recruitment: భారత వాతావరణ శాఖలో 990 ఉద్యోగాలు, అర్హతలివే!
భారత వాతావరణ శాఖలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్-'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 18లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లి్క్ చేయండి...


TMC Jobs: విశాఖపట్నం టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ఖాళీలు, పోస్టులివే
విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో వివిధ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు చేపట్టనున్నారు.అక్టోబరు 6 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిచనున్నారు. విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, వాకిన్ వివరాల కోసం క్లిక్ చేయండి..

UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 04 Oct 2022 03:25 PM (IST) Tags: TSRTC Jobs TSRTC Apprentices Recruitment Graduate Apprentices Apprentice Posts

సంబంధిత కథనాలు

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?

Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్