By: ABP Desam | Updated at : 27 Sep 2023 01:03 PM (IST)
Edited By: omeprakash
స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ఆప్షన్లు..
తెలంగాణలోని ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మల్టీ జోన్-1 పరిధిలో 19 జిల్లాల్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, అలాగే మల్టీ జోన్-2లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని వారికే బదిలీలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది. బదిలీలకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సెప్టెంబరు 28, 29 తేదీల్లో తమకు కావాల్సిన పాఠశాలలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
ఆప్షన్లను మార్చుకోవాలనుకునేవారికి సెప్టెంబరు 30న వివరాలను మార్చుకోవడానికి అవకాశం కల్పించాలరు. స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుంటున్న వారు తమ భార్య లేదా భర్త పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గర్లోని పాఠశాలలను మాత్రమే ఎంచుకోవాలని, ఈ మేరకు డీఈఓలు పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సెప్టెంబరు 26న ఆదేశించారు.
టెట్ ఫలితాలు విడుదల..
ఇదిలా ఉండగా.. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ టెట్ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు సబ్జెక్టులవారీగా తుది ఆన్సర్ ‘కీ’ని కూడా అధికారులు విడుదల చేశారు. సెప్టెంబరు 15న నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని సెప్టెంబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఇక సెప్టెంబరు 27న తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
అక్టోబరు 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
డీఎస్సీ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
సీడాక్ తిరువనంతపురంలో 54 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఎంపికైతే రూ.1 లక్ష వరకు జీతం
తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 29లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్-కళ్యాణిలో 120 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
SSC JE Exams: ఎస్ఎస్సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
/body>