UPSC Prelims 2022 : ముగిసిన యూపీఎస్సీ ప్రిలిమ్స్, కొత్త తరహా ప్రశ్నలు, పరీక్ష ఎలా ఉందంటే?
UPSC Prelims 2022 : యూపీఎస్సీ సివిల్స్-2022 ప్రిలిమ్స్ పరీక్ష ఇవాళ జరిగింది. కోవిడ్ వ్యాక్సిన్స్ ఆధారిత ప్రశ్నలు, ఆరోగ్య సేతుతో పాటు వెబ్ 3.0 ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు అంటున్నారు.
UPSC Prelims 2022 : యూపీఎస్సీ సివిల్స్- 2022 ప్రిలిమ్స్ పరీక్ష ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఇవాళ రెండు షిఫ్ట్ ల్లో ప్రిలిమ్స్ పరీక్ష పూర్తైంది. జూన్ 5వ తేదీ ఉదయం 11.30 గంటలకు మొదటి షిఫ్ట్‌ని పూర్తి కాక, మధ్యాహ్నం 4.30 గంటలకు రెండో షిఫ్ట్ పూర్తైంది. UPSC ప్రిలిమ్స్ మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై 11.30 వరకు కొనసాగింది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 నుండి ప్రారంభమై సాయంత్రం 4.30 వరకు కొనసాగింది. జనరల్ స్టడీస్ GS-I పరీక్ష ఉదయం షిఫ్ట్ లో నిర్వహించారు. జనరల్ స్టడీస్ GS-II లేదా CSAT పేపర్ మధ్యాహ్నం షిఫ్ట్‌లో నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు రెండు పరీక్షలకు హాజరు కావాలి. మార్నింగ్ షిఫ్ట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలి కరోనా వైరస్ పై ప్రశ్నలు ఉన్నాయి. ఆరోగ్య సేతు యాప్‌తో పాటు భారతీయ వారసత్వం, సంస్కృతి ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారు.
కోవిడ్ ఆధారిత ప్రశ్నలు
భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లు కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ ఆధారంగా ప్రశ్నలు అడిగారు. అంతే కాకుండా గత కొన్నేళ్ల కంటే ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. టెక్నాలజీ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. ఇందులో వెబ్ 3.0 వంటి అంశాలు ఉన్నాయి. కొత్త ప్రశ్నపత్రాల నమూనాను కూడా ప్రారంభించారు. దీని గురించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కొత్త ప్యాటర్న్‌ను ఛేదించడం కష్టమని అభ్యర్థులు తెలిపారు.
వచ్చే ఏడాది పరీక్ష ఎప్పుడంటే?
సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్, లేదా CSAT యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అర్హత పరీక్ష. ఇందులో ఉత్తీర్ణత మార్కులు మాత్రమే అవసరం. ఈ పేపర్‌లో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఏదేమైనా ఈ రెండో పేపర్ అంచనా వేయడం కష్టమని అభ్యర్థులు అంటున్నారు. కనీస మార్కులను పొందాలంటే తప్పనిసరిగా ప్రిపరేషన్ చాలా అవసరం అని చెబుతున్నారు. UPSC ప్రిలిమ్స్-2023 వచ్చే ఏడాది మే 28న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 2023లో ప్రారంభమవుతుంది. UPSC పరీక్షల క్యాలెండర్ ఇప్పటికే విడుదల చేసింది. ఇది upsc.gov.inలో అందుబాటులో ఉంది.
When UPSC aspirants claims their syllabus is anything under the sky, they really mean it 🤩#UPSCPrelims2022 @RubiDilaik #RubinaDiIaik #RubinaDilaikInKKK12 pic.twitter.com/5y1cNePyN4
— THE KHABRI (@ThreaIkhabri) June 5, 2022