అన్వేషించండి

UPSC CMSE 2024 Results: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్-2024 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

CMSE Results: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ జులై 30న విడుదల చేసింది.

Combined Medical Services Examination, 2024 Written Test Results: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 827 మెడికల్ ఆఫీసర్ల నియామకానికి జులై 14న నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 (CMSE) రాతపరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జులై 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూడవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో బ్రాంచ్‌లవారీగా ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ/పర్సనాలిటిటీ టెస్ట్ నిర్వహించనున్నారు. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ అర్హత లేదా ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు స్వీకరించింది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 14న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించింది. 

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ఫలితాల కోసం అభ్యర్థులు మొదట యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://upsc.gov.in/

➥అక్కడ హోంపేజీలో whats-new సెక్షన్‌లో సీఎంఎస్‌ఈ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

➥పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.

➥అందుబాటులో అభ్యర్థులు తమ రూల్ నెంబరు పరిశీలించుకోవాలి. కంప్యూటర్ కీ బోర్డు మీద CTRL + F కాంబినేషన్ క్లిక్ చేసి, అక్కడ కనిపించే బాక్సులో తమ రూల్ నెంబరు నమోదుచేయాలి.

➥అభ్యర్థులు ఒకవేళ పరీక్షలో అర్హత సాధిస్తే.. పీడీఎఫ్‌లోని ఫలితాల్లో చూపిస్తుంది. ఒకవేళ నెంబరు లేకపోతే అర్హత సాధించనట్టే.

➥ఫలితాల పీడీఎఫ్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

వివరాలు..

* యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024

ఖాళీల సంఖ్య: 827 పోస్టులు 

1) మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్: 163 పోస్టులు

విభాగం: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్

2) అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్: 450 పోస్టులు

విభాగం: రైల్వే.

3) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 14 పోస్టులు

విభాగం: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.

4) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2): 200 పోస్టులు

విభాగం: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.

విద్యార్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.08.2024 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు. 

పరీక్ష విధానం..
✪ పార్ట్-1లో భాగంగా మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరకు 250 మార్కులు. ఒక్కో పేపరులో 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
✪ పేపర్-1లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ గురించి, పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ & అబ్‌స్ట్రేట్రిక్స్, ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
✪ పార్ట్-2లో భాగంగా 100 మార్కులకు పర్సనాలిటీ పరీక్ష నిర్వహిస్తారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget