UIIC Notification: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో 300 అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.62,265 వరకు జీతం
UIIC Assistants: చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యాలయాల్లో అసిస్టెంట్ (Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
United India Insurance Co. Ltd Recruitment: చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యాలయాల్లో అసిస్టెంట్ (Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 16 నుంచి జనవరి 6 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.22,405 - రూ.62,265 వేతనంగా ఇస్తారు.
వివరాలు...
* అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 300 పోస్టులు
తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు: ఆంధ్రప్రదేశ్-8 పోస్టులు, తెలంగాణ- 3 పోస్టులు.
పోస్టుల కేటాయింపు: యూఆర్-159, ఎస్సీ-30, ఎస్టీ-26, ఓబీసీ-55, ఈడబ్ల్యూఎస్-30.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. సంబంధిత ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 30.09.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 45 సంవత్సరాల వరకు, సంస్థ ఉద్యోగులు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 250 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ 40 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వే్జ్-40 ప్రశ్నలు-50 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్/జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్: చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం.
పే స్కేల్: రూ.22,405 - రూ.62,265.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16.12.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.01.2024.
➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.01.2024.
➥ ఆన్లైన్ రాతపరీక్ష కాల్ లెటర్ల డౌన్లోడ్: పరీక్షకు 10 రోజుల ముందునుండి.
ALSO READ:
ఎగ్జిమ్ బ్యాంకులో మేనేజ్మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ముంబయిలోని ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIM) సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మేనేజర్ (Manager), మేనేజ్మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా జనవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..