అన్వేషించండి

UPSC NDA and NA Results: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్ - 2023 తుది ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 628 మంది అర్హత

ఎన్‌డీఏ & ఎన్ఏ (1)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) అక్టోబరు 27న విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది.

ఎన్‌డీఏ & ఎన్ఏ (1)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) అక్టోబరు 27న విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. మొత్తం 628 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికయ్యారు. 

UPSC NDA-1 2023 తుది ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?

🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in ఓపెన్‌ చెయ్యాలి.

🔰 హోమ్‌పేజ్‌లో కనిపించే 'Final Result: National Defence Academy and Naval Academy Examination (I), 2023' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. 

🔰 క్లిక్ చేయగానే ' ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ కనిపిస్తుంది.

🔰  ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

🔰  మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(NDA) 151వ కోర్సు, నేవల్‌ అకాడమీ(NA) 113వ కోర్సుల్లో ప్రవేశాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 395 ఖాళీలను భర్తీచేయనున్నారు. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుండి 2022 జనవరి 10 వరకు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షలు రెండు సెషన్లలో జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో సెషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 2న విడుదలచేశారు. పరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. తాజాగా తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 02-01-2024 నుంచి ప్రారంభమయ్యే 151వ కోర్సులో, 113వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు.

సందేహాలుంటే సంప్రదించవచ్చు..

🔰 అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన, విద్యార్హతలు తదితర విషయాల్లో ఏమైనా సందేహాలుంటే  011-23385271/011- 23381125/011-23098543 ఫోన్  నెంబర్లలో ఉదయం 10:00 గంటల నుంచి  సాయంత్రం 17:00 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించవచ్చు. 

🔰 ఇంటర్వ్యూకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 011-26175473, 011-23010097 నెంబర్లు లేదా joinindianarmy.nic.in for Army, Emai: officer-navy@nic.in ద్వారా సంప్రదించవచ్చు.

🔰 అదేవిధంగా నేవీ/నేవల్ అకాడమీకి సంబంధించిన సమస్యలపై  011-010231 Extn.7645/7646/7610 ఫోన్ నెంబర్లు లేదా joinindiannavy.gov.in  లేదా www.careerindianairforce.cdac.in ద్వారా సంప్రదించవచ్చు.

ALSO READ:

MOIL: మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్‌లో 32 ఖాళీలు, పోస్టుల వివరాలు ఇలా
నాగ్‌పుర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్‌(మొయిల్‌) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 9లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

రాష్ట్రీయ కెమికల్స్‌ & ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 408 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
AP School Uniform: జగన్ సర్కార్ యూనిఫాం పాయే.. కూటమి ప్రభుత్వం కొత్త యూనిఫాం తెచ్చే..
జగన్ సర్కార్ యూనిఫాం పాయే.. కూటమి ప్రభుత్వం కొత్త యూనిఫాం తెచ్చే..
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Viral Video: వెళ్తున్న రైల్లో స్టంట్స్ చేయాలనుకున్నాడు కానీ అలా ఇరుక్కుపోయాడు - ఈ వీడియో చూస్తే నవ్వాలా? జాలిపడాలా?
వెళ్తున్న రైల్లో స్టంట్స్ చేయాలనుకున్నాడు కానీ అలా ఇరుక్కుపోయాడు - ఈ వీడియో చూస్తే నవ్వాలా? జాలిపడాలా?
Embed widget