RCFL: రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 408 పోస్టులను భర్తీ చేయనున్నారు.
![RCFL: రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి Rashtriya Chemicals and Fertilizers Limited has released notification for the recruitment of Apprentices Posts RCFL: రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/9e0ba70c8e2c74388a929ee38e056bca1698243090968522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 408 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 408.
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-61, ఎస్టీ-30, ఓబీసీ(NCL)-110, ఈడబ్ల్యూఎస్-40, జనరల్-167.
➥ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 157 ఖాళీలు
విభాగాలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (హెచ్‌ఆర్).
అర్హత: బీకాం, బీబీఏ, ఏదైనా డిగ్రీతో పాటు ఆంగ్ల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
➥ టెక్నీషియన్ అప్రెంటిస్: 115 ఖాళీలు
విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
➥ ట్రేడ్ అప్రెంటిస్: 136 ఖాళీలు
విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), బాయిలర్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ).
అర్హత: ట్రేడును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.04.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
శిక్షణ ప్రాంతం: ట్రాంబే (ముంబయి), థాల్ (రాయ్‌గఢ్ జిల్లా).
స్టైపెండ్: టెక్నీషియన్ అప్రెంటిస్ (ఒకేషనల్) పోస్టులకు నెలకు రూ.7000, టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) పోస్టులకు రూ.8000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (డిగ్రీ) పోస్టులకు రూ.9000 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.11.2023. (05:00 pm)
Trade Apprenticeship Registration
Technician Apprentice Registration
ALSO READ:
నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ విభాగంలో డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)