అన్వేషించండి

UPSC ESE 2024 Results: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

UPSC ESE Results: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ - 2024 తుది ఎంపిక ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 206 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

UPSC Engineering Services Examination Main 2024 Final Results: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబరు 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూడవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో బ్రాంచ్‌లవారీగా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ/పర్సనాలిటిటీ టెస్ట్ నిర్వహించిన తర్వాత.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ప్రభుత్వం పేర్కొన్ని మొత్తం 251 పోస్టులకుగాను 206 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేశారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్-92, మెకానికల్ ఇంజినీరింగ్-18, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-26, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్-70 మంది ఎంపికయ్యారు. 

UPSC - ఇంజినీరింగ్ సర్వీసెస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

బ్రాంచ్‌లవారీగా టాపర్లు వీరే..

➥ సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో రోహిత్ దోంగే టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్లో హర్షిత్ పాండే, లక్ష్మీకాంత్ నిలిచారు.

➥ మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో మునీష్ కుమార్ టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్లో రాజేశ్ కసానియా, గొల్లంగి సతీశ్ నిలిచారు.

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో రజన్ కుమార్ టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో సత్యం చంద్రకాంత్ ఖైర్నర్, ప్రియాన్షు ముద్గల్ నిలిచారు.

➥ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో హిమాన్షు తప్లియాల్ టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో యశస్వీ విజయ్‌ వర్గియా, ఉన్నతి చన్‌సోరియా నిలిచారు.

దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గతేడాది సెప్టెంబరు 6న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18న ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలను మార్చి 28న యూపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 23న మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు జులై 30న విడుదలచేశారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 7 నుంచి నవంబరు 5 వరకు స్టేజ్‌-3(పర్సనాలిటీ టెస్ట్‌-ఇంటర్వ్యూ), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తవడంతో తాజాగా మెయిన్ తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 

పోస్టుల వివరాలు..

* ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024

పోస్టుల సంఖ్య: 251 (సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్).

సంస్థలు: ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget