UPSC EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 577 ఖాళీలు, పూర్తి వివరాలు ఇలా!
పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 577 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 577
1) ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 418 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-57, ఎస్టీ-28, ఓబీసీ-78, ఈడబ్ల్యూఎస్-51, జనరల్-204. వీటిల్లో దివ్యాంగులకు 25 పోస్టులు కేటాయించారు.
అర్హత: పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలు నిర్ణయించారు. పూర్తి నోటిఫికేషన్‌లో అర్హతలు, ఇతర వివరాలు చూడవచ్చు.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
2) అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్: 159 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-25, ఎస్టీ-12, ఓబీసీ-38, ఈడబ్ల్యూఎస్-16, జనరల్-68. వీటిల్లో దివ్యాంగులకు 8 పోస్టులు కేటాయించారు.
అర్హత: పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలు నిర్ణయించారు. పూర్తి నోటిఫికేషన్‌లో అర్హతలు, ఇతర వివరాలు చూడవచ్చు.
వయోపరిమితి: 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.03.2023.
➥ అడ్మిట్ కార్డు విడుదల తేది: ప్రకటించాల్సి ఉంది.
➥ రాత పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
Also Read:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టులు, అర్హతలివే!
గుజరాత్‌లోని వడోదర ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీతోపాటు నిర్ణీత పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 28లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..