అన్వేషించండి

UPSC NDA & NA Exam: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (2)-2025 నోటిఫికేషన్ వెల్లడి, 406 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం

UPSC NDA NA News: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (II)- 2025 నోటిఫికేషన్ మే 28న విడుదల చేసింది.

UPSC NDA & NA (II) 2025: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (II)- 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో దాదాపు 406 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2025, సెప్టెంబరు 14న రాతపరీక్ష నిర్వహించనుంది. శిక్షణ‌తోపాటు త్రివిధ ద‌ళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 28 నుంచి, జూన్ 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2026, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జులై 1 నుంచి నుంచి ప్రారంభమయ్యే  156వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 118వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 

పోస్టుల వివరాలు...

* ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (2)-2025

ఖాళీల సంఖ్య: 406

⏩ నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 370 పోస్టులు

➜ ఆర్మీ-208

➜ నేవీ-42

➜ ఎయిర్‌ఫోర్స్-120

⭑ ఫ్లయింగ్ బ్రాంచ్: 92 

⭑ గ్రౌండ్ డ్యూటీలు (టెక్):18 

⭑ గ్రౌండ్ డ్యూటీలు (నాన్-టెక్): 10 

⏩ నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 36

అర్హత: ఆర్మీ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇక నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: అభ్యర్థులు 01.01.2007 - 01.01.2010 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులకు రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం: 

* మొత్తం 900 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మొత్తం రెండు పేపర్లుంటాయి.

* పేపర్-1(మ్యాథమెటిక్స్)కు 300 మార్కులు, పేపర్-2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)కు 600 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.

* పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి.

* రాతపరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ/ఎస్‌ఎస్‌బీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 900 మార్కులు కేటాయించారు.

* రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.

కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. ఎంపికైనవారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.05.2025.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.06.2025. (6:00 PM.)

* పరీక్ష తేదీ: 14.09.2025.

* కోర్సులు ప్రారంభం: 01.07.2026.

Notification 

Online Application

Website

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget