UPSC Prelims Result 2021: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ మీకోసం
UPSC Civil Services Prelims Result 2021: దేశంలో అత్యన్నత సర్వీసులైన ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 19 విభాగాల్లో అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్ శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి.
UPSC 2021 Result Direct Link: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
Union Public Service Commission has declared the result of Civil Services Preliminary Examination 2021 pic.twitter.com/vVRfSs0ga4
— ANI (@ANI) October 29, 2021
అక్టోబర్ 10 తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా రెండు సెషన్లలో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నేడు విడుదల చేశారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
Also Read: సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థుల రియాక్షన్ ఇదే.. కేటగిరీల వారీగా కటాఫ్ ఎంత ఉండొచ్చంటే!
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్సర్ కీ అధికారిక వెబ్ సైట్ https://upsc.gov.in/లో అప్‌లోడ్ చేసినట్లు కమిషన్ స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసంగానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో ఫెసిలిటేషన్ కౌంటర్‌ను సంప్రదించాలని ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు యూపీఎస్సీ సూచించింది.
UPSC 2021 Result Direct Link: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
Also Read: నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా.. 20 టాప్ మోస్ట్ కంపెనీలు, వెయ్యికి పైగా పోస్టులు... ఎప్పుడంటే..!
సివిల్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరు 200 మార్కులకు చొప్పున మొత్తం 400 మార్కులు ప్రిలిమనరీ పరీక్షకు కేటాయించారు. ఒక్కో పేపరుకు రెండు గంటల వ్యవధి ఉంటుంది.