BANK JOBS: యూనియన్ బ్యాంక్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!
యూనియన్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
యూనియన్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎంబీఏ/ పీహెచ్‌డీ/ ఎంఫిల్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 33
పోస్టులు: ఎక్స్‌టర్నల్ యూఎల్ఏ హెడ్స్, ఎక్స్‌టర్నల్ ఫ్యాకల్టీ, అకడమిషియన్లు, ఇండస్ట్రీ అడ్వైజర్లు.
విభాగాలు: కార్పొరెట్ & ట్రెజరీ, క్రెడిట్ అండ్ పాలసీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆపరేషన్ ఎక్స్‌లెన్స్, పీపుల్ ఎక్స్‌లెన్స్, రిస్క్ ఎక్స్‌లెన్స్, రూరల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్,సేల్స్ అండ్ మార్కెటింగ్, స్ట్రాటజీ&ఫైనాన్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎంబీఏ/ పీహెచ్‌డీ/ ఎంఫిల్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
పని అనుభవం: కనీసం 5-10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28-60 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పని ప్రదేశం: ముంబయి, భోపాల్, హైదరాబాద్, బెంగళూరు, లఖ్‌నవూ, గురుగావ్, మంగళూరు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07.12.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.12.2022.
Also Read:
గుడ్ న్యూస్, మరో 1492 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి, త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణలో ఉద్యోగాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పోలీసు నియామకాల ప్రక్రియ కొనసాగుతుండగా, గ్రూప్-4 నోటిఫికేషన్ కూడా వెలువడింది. మరోవైపు వైద్యారోగ్యశాఖలోనూ ఖాళీల భర్తీకి తెరలేచింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ డిసెంబరు 7న ఉత్తర్వులు(జీవో నెంబర్ 1563) జారీ చేసింది. వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..