అన్వేషించండి

APPSC: ఒకేరోజు రెండు పరీక్షలు, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్ష ఉన్నవారికి మరో తేదీలో 'గ్రూప్-2' పరీక్ష!

ఒకవైపు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష, మరోవైపు ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష.. ఈ రెండు పరీక్షలు ఒకేరోజు వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

APPSC Group2 Exam: ఒకవైపు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష, మరోవైపు ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష.. ఈ రెండు పరీక్షలు ఒకేరోజు వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రూప్-2 పరీక్ష తేదీని నిర్ణయించడంపై ఏపీపీఎస్సీ తీరును ఉద్యోగార్థులు నిరసిస్తున్నారు. ఏపీపీఎస్సీ వెనకాముందు చూసుకోకుండా ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న రోజే గ్రూపు-2 ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగ నియామకాల పరీక్ష తేదీల ఖరారు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే పరీక్షలు, వాటి తేదీలను పరిగణనలోకి తీసుకొని ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించాల్సి ఉంటుంది. కానీ.. గ్రూపు-2 ప్రిలిమ్స్ తేదీ ఖరారులో ఎస్‌బీఐ పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకోలేదు. 

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టుల భర్తీకి గత నవంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లోనే ఫిబ్రవరి 25న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఇక రాష్ట్రంలో గ్రూపు-2 నోటిఫికేషన్ గత డిసెంబరు 7న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రెండూ ఒకే రోజున ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గ్రూపు-2 ఉద్యోగాలకు సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. గ్రూపు-2 నోటిఫికేషన్ జారీకి, ప్రిలిమ్స్ నిర్వహణ తేదీ మధ్య ఇచ్చిన సమయం తక్కువగా ఉన్నందున ప్రిలిమ్స్ నిర్వహణ తేదీని వాయిదా వేయాలన్న డిమాండు అభ్యర్థులనుంచి వస్తోంది. కొందరు అభ్యర్థులు విజయవాడలో కేంద్రం కేటాయించాలని దరఖాస్తులో పేర్కొంటే గుడివాడలో ఇచ్చారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఎస్‌బీఐ హాల్‌టికెట్లు పంపితే తేదీని మారుస్తాం.. 
ఎస్‌బీఐ క్లరికల్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు హాల్‌టికెట్లను తమకు పంపించాలని ఏపీపీఎస్సీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. పరీక్ష విషయంలో ఎస్‌బీఐ ఉన్నతాధికారులను సంప్రదించాం. మాకు అందిన 10 మంది అభ్యర్థుల హాల్‌టికెట్లు వారికి పంపగా.. వారు మార్చి 4న (మరో స్లాట్) పరీక్ష నిర్వహించేందుకు ఆమోదించారు. ఇంకా ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 19లోగా తెలియజేయాలి. ఆ వివరాలను వారికి పంపి పరీక్ష తేదీల మార్పునకు కృషి చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం(ఫిబ్రవరి 17న) ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులు విజ్ఞప్తులు పంపాల్సిన
ఈమెయిల్: appschelpdesk@gmail.com

ALSO READ:

ఎస్‌బీఐలో 80 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), డిప్యూటీ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(అప్లికేషన్‌ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు మార్చి 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్ంగ్‌, ఇంటర్వూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget