Group1 Recruitment: 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి కసరత్తు, ఖాళీల వివరాలు సేకరణ - పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం!
తెలంగాణలో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది.

TSPSC Group1 Recruitment: తెలంగాణలో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో గత గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మొత్తం 503 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అదనంగా మరిన్ని ఖాళీలు చేరే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా అదనంగా ఏర్పడిన ఖాళీలు, మరో ఏడాదిలో పదవీ విరమణతో ఏర్పడే ఖాళీలు గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు కొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశాయి. అదనంగా వచ్చే గ్రూప్-1 ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత రానుంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
ముందుకెళ్లాలా? వేచి చూడాలా?
గ్రూప్-1 పరీక్షపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై కొత్తగా ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీ బోర్డు, ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దుచేసి ముందుకెళ్లాలా? లేదా తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా? కొత్తగా గుర్తించే ఖాళీలతో తాజాగా మరో గ్రూప్-1 నోటిఫికేషన్ వేయడమా? లేదా పాత నోటిఫికేషన్‌కు అనుబంధంగా చేర్చడమా? అనే విషయమై నిర్ణయం వెలువడాల్సి ఉంది.
రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల ఆధారంగా..
2011లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌పై న్యాయవివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఆ నియామకాలు 2018లో పూర్తయ్యాయి. తాజాగా వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల వివరాలను టీఎస్‌పీఎస్సీ రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, సర్వీసు నిబంధనలు, విద్యార్హతలు అన్నీ పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్-1 నుంచి కిందిస్థాయి వరకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఆయా ఖాళీల భర్తీకి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతం జారీ చేసిన వాటి నియామక ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న విషయమై ఇప్పటికే నియామక సంస్థల నుంచి ప్రభుత్వం వివరాలు తీసుకుంది.
ALSO READ:
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

