అన్వేషించండి

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ట్విస్ట్, అభ్యర్థుల తల్లిదండ్రులను లాగే అవకాశం?

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు నమోదైన అరెస్టులు 78కి చేరాయి. గడచిన రెండు రోజుల్లోనే 21 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో కనీసం 150 మంది వరకూ అరెస్ట్ అవుతారని భావిస్తున్నారు. 

పేపర్ లీక్ వ్యవహారం నిందితుల తల్లిదండ్రుల మెడకూ చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం డబ్బు చెల్లించిన అనేక మంది, ఆ డబ్బు తమ తల్లిదండ్రుల నుంచే తెచ్చుకున్నారు. అంటే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు గురించి చాలామంది తల్లిదండ్రులకు ముందే తెలిసి ఉంటుంది. నేరం గురించి తెలిసీ చెప్పకపోవడం తప్పు కాబట్టి వారిని కూడా ఈ కేసులో జోడించే అవకాశం ఉంది. అయితే వీరిని సాక్షులుగానే పరిగణించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సిట్‌ అధికారులు న్యాయపరమైన కసరత్తు చేస్తున్నారు. 

చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఓ అభ్యర్థి అయితే ఏకంగా ఏఈ ప్రశ్నపత్రానికి రూ.30 లక్షలు చెల్లించాడు. కేవలం ఏఈ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ దళారీ రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా అనేక మంది పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి ప్రశ్నపత్రాలు పొందారు. ఈ పరీక్షలు రాసిన వారిలో ఒకర్దిదరు మినహా మిగతావారంతా నిరుద్యోగులే, తల్లిదండ్రులపై ఆధారపడిన వారే ఉంటారు. కాబట్టి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ చేర్చకపోతే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. న్యాయవిచారణ మొదలైనప్పుడు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసేందుకు అంత పెద్దమొత్తంలో డబ్బు ఎలా వచ్చింది? అని న్యాయస్థానం అడిగితే సమాధానం చెప్పాలి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రం లీకేజీలో కొందరు తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చాలని భావిస్తున్నారు.

ALSO READ:

ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో 775 గ్రూప్ బి, సి పోస్టులు, అర్హతలివే!
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) వివిధ గ్రూప్ బి, సి (నాన్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్‌) 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్‌ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 31 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget