News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AIIMS: ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో 775 గ్రూప్ బి, సి పోస్టులు, అర్హతలివే!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) వివిధ గ్రూప్ బి, సి (నాన్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

FOLLOW US: 
Share:

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) వివిధ గ్రూప్ బి, సి (నాన్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 775.

* గ్రూప్ బి, సి పోస్టులు

పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్ (A/C&R), అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), చీఫ్ క్యాషియర్, CSSD టెక్నీషియన్, డైటీషియన్, గ్యాస్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (అకౌంటెంట్), జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వార్డెన్ (హాస్టల్ వార్డెన్ మహిళలు), లైబ్రేరియన్ గ్రేడ్-III, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-I, మెడికో సోషల్ వర్కర్, మల్టీ - రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియోథెరపిస్ట్), పర్సనల్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ, ప్రోగ్రామర్ (డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్), సైకియాట్రిక్ సోషల్ వర్కర్,పబ్లిక్ హెల్త్ నర్స్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ గ్రేడ్-I, రేడియో థెరపీ టెక్నీషియన్ గ్రేడ్-II, సీనియర్ హిందీ ఆఫీసర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, స్టోర్ కీపర్, TB & ఛాతీ వ్యాధుల ఆరోగ్య సహాయకుడు, టెక్నికల్ ఆఫీసర్ (డెంటల్) (డెంటల్ టెక్నీషియన్), టెక్నికల్ ఆఫీసర్ (ఆప్టల్) (రిఫ్రాక్షనిస్ట్),మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్ సూపర్‌వైజర్), ఆపరేషన్ థియేటర్/అనస్థీషియా బి లెవల్ కోసం టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్ సూపర్‌వైజర్), వృత్తి కౌన్సెలర్, ఆర్టిస్ట్ (మోడలర్), అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్, క్యాషియర్, కోడింగ్ క్లర్క్, డి గ్రేడార్క్ రూమ్ ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A, డిస్పెన్సింగ్ అటెండెంట్, డిసెక్షన్ హాల్ అటెండెంట్, డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), ఎలక్ట్రీషియన్, గ్యాస్ మెకానిక్, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III, నర్సింగ్ ఆర్డర్లీ, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టాన్, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్స్), ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ II, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్-II, లైన్‌మ్యాన్ (ఎలక్ట్రికల్), మానిఫోల్డ్ టెక్నీషియన్ (గ్యాస్ స్టీవార్డ్), మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్, మెకానిక్(ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్), మెకానిక్ (E & M), మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ (రికార్డ్ క్లర్క్), ఆఫీస్ అటెండెంట్ గ్రేడ్-II, ఆపరేటర్ (E & M) / లిఫ్ట్ ఆపరేటర్, ఫార్మా కెమిస్ట్ / కెమికల్ ఎగ్జామినర్, ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ప్లంబర్ , పంప్ మెకానిక్, రిసెప్షనిస్ట్, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్-II, సెక్యూరిటీ కమ్ ఫైర్ జమాదార్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, స్టెనోగ్రాఫర్, స్టోర్ కీపర్-కమ్-క్లార్క్, స్టోర్స్ అటెండెంట్ గ్రేడ్-II, టైలర్ గ్రేడ్-III, వైర్‌మెన్.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: పోస్టుని అనుసరించి 18- 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా.

ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ: 01.07.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Notification

Website

ALSO READ:

'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Jul 2023 08:49 PM (IST) Tags: AIIMS AIIMS Notification AIIMS Recruitment various group ‘b’ & ‘c’ posts

ఇవి కూడా చూడండి

Railway Recruitment: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా

Railway Recruitment: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు !  గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda :  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన