అన్వేషించండి

TSPSC: వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్ రాతపరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

తెలంగాణ పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి జులై 14న నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక జవాబు 'కీ'ని టీఎస్‌పీఎస్సీ విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

తెలంగాణ పశు సంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టుల భర్తీకి జులై 14న నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక జవాబు 'కీ'ని టీఎస్‌పీఎస్సీ విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచింది. ఆన్సర్ 'కీ'పై అభ్యంతరాలకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి ఆగ‌స్టు 19న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను నమోదు చేయవచ్చు. అభ్యంతరాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లింకు ద్వారా మాత్రమే నమోదుచేయాల్సి ఉంటుంది.

TSPSC: వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్ రాతపరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 185

1) వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ): 170 పోస్టులు 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్ & ఏనిమల్ హస్బెండరీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

2) వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి): 15 పోస్టులు 

అర్హత: డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్ & ఏనిమల్ హస్బెండరీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీనితోపాటు పీజీ డిగ్రీ/పీ జీడిప్లొమా (మైక్రోబయాలజీ/ పారాసైటాలజీ/ ఎపిడిమియోలజీ/ వైరాలజీ/ ఇమ్యూనాలజీ/ పాథాలజీ) లేదా బయోటెక్నాలజీతో మాస్టర్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్) లేదా వెటర్నరీ పబ్లిక్ హెల్త్‌తో మాస్టర్ డిగ్రీ(వెటర్నరీ సైన్స్).

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
                         TSPSC: వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్ రాతపరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

దరఖాస్తు ఫీజు: రూ.320. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (వెటర్నరీ సైన్స్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

జీతం: రూ.54,220 – రూ.1,33,630.

Notification

Website 

ALSO READ:

గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం - ఈ తేదీల్లోనే!
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన చేసింది. పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. నిర్ణీత గడువులోగా మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వివరాలు మార్చుకునేవారు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణ తొలి గ్రూప్‌-3 పరీక్షకు మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget