TSPSC CDPO Recruitment: సీడీపీవో రాతపరీక్ష ఆన్సర్ 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే
అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనవరి 3న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ, జవాబు పత్రాలను (రెస్పాన్స్ షీట్లను) జనవరి 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు తెలిపింది.
అభ్యంతరాల నమోదుకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక లింకు ద్వారా అభ్యర్థులు జనవరి 11 నుంచి 15 వరకు తమ అభ్యంతరాలు సమర్పించాలని సూచించింది. జనవరి 15న సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక లింకు అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. అభ్యంతరాలకు సంబంధించిన సమాచారం, ఆధారాలను పీడీఎఫ్ ఫార్మట్లో జతచేయాలని, వెబ్‌సైట్లు, సోర్సుల పేరిట ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.
తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో మొత్తం 23 ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 5న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 10 వరకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 3న రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 75 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
జనవరి 3న సీడీపీవో పరీక్షను రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 75 కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు) పరీక్ష నిర్వహించారు. మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దాదాపు 14 వేలమంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
నోటిఫికేషన్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్-1లో ఉండగా.. 59 పోస్టులు మల్టీ జోన్-2 పరిధిలో ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో పురుషులకు 71 పోస్టులు, మహిళలకు 42 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ - అర్హతలివే!
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..