అన్వేషించండి

TSPSC Group 4 Application: 'గ్రూప్-4' దరఖాస్తులు మళ్లీ ఆలస్యం! ఆగ్రహంతో అభ్యర్థులు!

రోజంతా దరఖాస్తు కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు టీఎస్‌పీస్సీ మరోసారి మొండిచేయి చూపించింది. కనీసం ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. దీంతో టీఎస్‌పీఎస్సీ తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రూప్-4 ఉద్యోగార్థుల ఓపికను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షిస్తున్నట్లుగా ఉంది. నోటిఫికేషన్‌లో ప్రకటించిన విధంగా డిసెంబర్ 23న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో సాంకేతిక కారణాలతో డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. అయితే డిసెంబరు 30న కూడా అదే పరిస్థితి తలెత్తింది. రోజంతా దరఖాస్తు కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు టీఎస్‌పీస్సీ మరోసారి మొండిచేయి చూపించింది. కనీసం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. దీంతో టీఎస్‌పీఎస్సీ తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని మండిపడుతున్నారు. ఒకవైపు వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న దరఖాస్తుల విషయంలో కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేకపోతుంది. 

రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 2న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్ - 429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్ - 6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్ - 18 పోస్టులు, వార్డు ఆఫీసర్ - 1,862 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వివరాలు... 

మొత్తం ఖాళీల సంఖ్య: 9168

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238

2) జూనియర్ అసిస్టెంట్: 6,859 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-307 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-742 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-1,245 రెవెన్యూశాఖ-2,077
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-18
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్.

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

Also Read:

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget