TSPSC: ప్రశాంతంగా ముగిసిన 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష, 66.16 శాతం హాజరు నమోదు!
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను తిరిగి వెనక్కి పంపారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 501 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న మొత్తం 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.
ప్రశ్న పత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో మళ్లీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కోసం 994 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
సిద్దిపేటలో అభ్యర్థి అరెస్ట్..
సిద్దిపేటలో పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి బయటకు వచ్చిన నిర్వాకానికి ప్రశాంత్ అనే అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఓఎంఆర్ షీట్‌లో హాల్‌టికెట్ నంబర్ తప్పుగా రాసిన అభ్యర్థి.. పరీక్ష రాసినా వృథా అని భావించి బయటకు వచ్చేశాడు. పరీక్ష కేంద్రం బయటకు రాగానే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రశాంత్‌పై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు.
Also Read:
టీఎస్‌పీఎస్సీ హార్టికల్చర్ ఆఫీసర్ హాల్‌టికెట్లు విడుదల
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాయిదా పడిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం (జూన్ 11) ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ లింకును కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసింది. ఈ మేరకు సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. ఈ మేరకు జూన్ 9న అధికారిక ప్రకటన విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం కటాఫ్ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్, ఇతర కేసుల వెరిఫికేషన్ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..