News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేయనున్నారు..

FOLLOW US: 
Share:

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 11న నిర్వహించే ప్రిలిమినరీ రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలని, దాని ప్రకారమే కీ ఆధారంగా వాల్యుయేషన్ జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

గ్రూప్-1 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలు..

➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు/పాన్ కార్డు లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. 

➥ పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోరు. 

➥అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు. 

➥ నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. 

➥ జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదు. 

➥ ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి. 

➥ సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన, వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్ చేసే పత్రాలు చెల్లుబాటు కావు. 

➥ ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వరు.

➥ ఎవరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 

నిబంధనలను అతిక్రమిస్తే డీబారే..
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇక నుంచి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో సంబంధాలున్న 50 మందిని రెండు రోజుల వ్యవధిలో కమిషన్ డిబార్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల్లో అల్లరి చేసినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా పోలీసు కేసులతో పాటు చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు ఇలా..

Also Read:

పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసింది. ఈ మేరకు సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. ఈ మేరకు జూన్ 9న అధికారిక ప్రకటన విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం కటాఫ్‌ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్‌ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్‌, ఇతర కేసుల వెరిఫికేషన్‌ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 11 Jun 2023 05:58 AM (IST) Tags: TSPSC Group1 Exam TSPSC Group1 Prelims Exam TSPSC Group1 Preliminary Exam Group1 Prelims Exam Halltickets Group1 Prelims Exam Pattern Instructions to Group1 Candidates

ఇవి కూడా చూడండి

SPMCIL: సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ నర్మదపురంలో సూపర్‌వైజర్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

SPMCIL: సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ నర్మదపురంలో సూపర్‌వైజర్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

SSC: స్టెనోగ్రాఫ‌ర్ అభ్యర్థులకు అలర్ట్. 'అప్లికేషన్ స్టేటస్' వివరాలు చెక్ చేసుకోండి, త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులో

SSC: స్టెనోగ్రాఫ‌ర్ అభ్యర్థులకు అలర్ట్. 'అప్లికేషన్ స్టేటస్' వివరాలు చెక్ చేసుకోండి, త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులో

SBI PO Recruitment: ఎస్‌బీఐ 2000 పీవో పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

SBI PO Recruitment: ఎస్‌బీఐ 2000 పీవో పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

AIIMS: ఎయిమ్స్‌-నాగ్‌పుర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!

AIIMS: ఎయిమ్స్‌-నాగ్‌పుర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!

AIIMS: ఎయిమ్స్‌-నాగ్‌పుర్‌లో 32 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!

AIIMS: ఎయిమ్స్‌-నాగ్‌పుర్‌లో 32 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!