అన్వేషించండి

TSPSC: కొనసాగుతున్న 'గ్రూప్-1' పరీక్ష, అభ్యర్థులకు బయో మెట్రిక్ తిప్పలు!

మొత్తం 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫకేషన్ విడుదల చేసింది. దీనికోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 1019 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

 రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరును నమోదుచేస్తుండటంతో ఉదయం 10.15 గంటలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని టీఎస్‌పీఎస్సీ ముందుగానే సూచించింది. దీంతో అభ్యర్థులు ముందుగానే ఎగ్జామ్‌ సెంటర్లకు చేరుకున్నారు.

పలు ప్రాంతాల్లో 10.15 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. మొత్తం 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫకేషన్ విడుదల చేసింది. దీనికోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 1019 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

కాగా హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత కోసం సీసీ కెమెరాల నీడలో ఈ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. అన్ని కేంద్రాల్లోని సీసీ కెమెరాలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. అలాగే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సైతం అనుసంధానం చేశారు.
'గ్రూప్‌-1' పరీక్ష రాయాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

 

అభ్యర్థులకు బయోమెట్రిక్ తిప్పలు..

కొన్ని పరీక్షా కేంద్రాల్లో బయో మెట్రిక్ ట్యాబ్ లు పనిచేయడం లేదు. సగానికిపైగా అభ్యర్థుల థంబ్స్ ను  ట్యాబ్ తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పరీక్షకు సమయం దగ్గరపడుతుండటం మరోవైపు థంబ్ అటెండెన్స్ లో ఇబ్బందులు ఎదురవుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

నిజాం కాలేజీలో గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు థంబ్ పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో అభ్యర్థి ఎన్నిసార్లు వేలిముద్రలు వేసినా పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ట్యాబ్ లో ఇబ్బందులు తలెత్తడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్ లో వేచి చూస్తున్నారు. పరీక్ష సమయం అవుతున్నందున తొందరగా పంపాలని కోరుతున్నారు. అధికారుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read:

TSPSC AE Jobs: తెలంగాణలో 837 ఇంజినీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!
తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి సెప్టెంబరు 12న నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


TSPSC Recruitment: 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!

తెలంగాణ స్టేట్ ​పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్ ​మరో భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


TSPSC Jobs: తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 20 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


APPSC Recruitment: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!

ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget