అన్వేషించండి

TSPSC: 'గ్రూప్-1' పరీక్ష ఏర్పాట్లపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్, అధికారులకు కీలక సూచనలు!

పరీక్ష సెంటర్ల ఏర్పాటు, అక్కడ పరిస్థితులపై కమిషన్ చైర్మన్ ఈ సందర్భంగా ఆరా తీశారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తెలంగాణలో అక్టోబర్‌ 16న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ బుధవారం (అక్టోబరు 12) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్‌లతో సహా ఇతర అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పరీక్షకు సరిగ్గా మూడు రోజులే మిగిలుండగా అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్ష సెంటర్ల ఏర్పాటు, అక్కడ పరిస్థితులపై కమిషన్ చైర్మన్ ఈ సందర్భంగా ఆరా తీశారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైతం జనార్దన్ అధికారులకు సూచించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌ 16న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో 1019 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌ 1 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 3.8లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.

'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం (అక్టోబరు 11) అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ హాజరవుతున్నారని చెప్పారు. పరీక్ష సజావుగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబరు  16న జరుగనున్న నేపథ్యంలో.. స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించి, పోలీసు రక్షణ ఏర్పాట్లుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ పరీక్షల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అక్టోబరు 12న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి అధికారులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ట్రంలో గ్రూప్‌–1 కేటగిరీలో 503 కొలువులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేయగా 3,80,202 మంది దరఖాస్తులు సమర్పించారు. వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూలై నెలలోనే నిర్వహించాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో, పరీక్షలను అక్టోబర్ 16కు వాయిదా వేశారు. ఈ పరీక్ష తేదీ కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష కచ్చితంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 కేటాయించారు. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమినరీ పరీక్ష నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.


:: Also Read ::

TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో మార్పులు, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
తెలంగాణలో అక్టోబరు 16న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తుుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నిర్వహించనున్న తొలి గ్రూప్-1 కావడంతో పలు మార్పులకు కమిషన్ శ్రీకారం చుట్టింది. ప్రిలిమినరీ పరీక్షకు వీలైనన్ని బహుళ సిరీస్‌లతో ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,041 పరీక్ష కేంద్రాల్లో అక్టోబరు 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 503 పోస్టులకు రాష్ట్రంలో 3,80,202 మంది హాజరుకానున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 9 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు వెబ్‌‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌  చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకు ఏర్పాటుచేసింది. 
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు పాటించాల్సిన సూచనల కోసం క్లిక్ చేయండి..


TSPSC: 'గ్రూప్-1' హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
తెలంగాణలో 'గ్రూప్‌–1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి గ్రూప్-1 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 16న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఓఎంఆర్ షీట్ విధానంలోనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
హాల్‌టికెట్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget