News
News
X

TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో మార్పులు, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

రాష్ట్రవ్యాప్తంగా 1,041 పరీక్ష కేంద్రాల్లో అక్టోబరు 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 503 పోస్టులకు రాష్ట్రంలో 3,80,202 మంది హాజరుకానున్నారు.

FOLLOW US: 
 

తెలంగాణలో అక్టోబరు 16న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తుుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నిర్వహించనున్న తొలి గ్రూప్-1 కావడంతో పలు మార్పులకు కమిషన్ శ్రీకారం చుట్టింది. ప్రిలిమినరీ పరీక్షకు వీలైనన్ని బహుళ సిరీస్‌లతో ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,041 పరీక్ష కేంద్రాల్లో అక్టోబరు 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 503 పోస్టులకు రాష్ట్రంలో 3,80,202 మంది హాజరుకానున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 9 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు వెబ్‌‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌  చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకు ఏర్పాటుచేసింది. 


తొలిగంటలోనే 50 వేల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్...
హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన గంట సమయంలోనే 50వేల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం (అక్టోబరు 9) రాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 1,32,406గా ఉన్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు, చిరునామాపై తలెత్తే సందేహాల నివృత్తికి జిల్లా కలెక్టరేట్లలో గ్రూప్‌-1 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.

 
TSPSC Group-1 Prelims Hall Tickets - కోసం క్లిక్ చేయండి..

News Reels

సంతకం తప్పనిసరి..
ఓఎంఆర్‌ పత్రంపై అభ్యర్థి, ఇన్విజిలేటర్ ఇద్దరూ సంతకాలు చేయాలని, ఏ ఒక్కరి సంతకం లేకున్నా మూల్యాంకనానికి జవాబు పత్రాల్ని పరిశీలించబోమని కమిషన్ ఛైర్మన్ స్పష్టంచేశారు. ఇరువురి సంతకాలు ఉండేలా అభ్యర్థి చూసుకోవాలని, తప్పుచేసే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని కమిషన్ ఛైర్మన్ హెచ్చరించారు. తప్పుడు ధ్రువీకరణలతో హాజరైనా, ఒకరి పేరిట మరొకరు వచ్చినట్లు తెలిసినా క్రిమినల్‌ కేసులు పెడతామని, కమిషన్ పరీక్షల నుంచి డీబార్‌ చేస్తామని హెచ్చరించింది. 


ప్రశ్నల జంబ్లింగ్ భారీగానే..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రభుత్వ పోటీపరీక్షలకు నిర్ణీత ప్రశ్నలను జంబ్లింగ్ చేసి ఇప్పటివరకు A, B, C, D సిరీస్‌ల పేరిట నాలుగు రకాల ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. ఇకపై నాలుగుకు మించి వీలైనన్ని బహుళ సిరీస్‌లు వచ్చేలా ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు A, B, C, D సిరీస్‌ల స్థానంలో ఆరంకెల ప్రశ్నపత్రం నంబరుతో ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనుంది. అభ్యర్థులు ఆరంకెల సిరీస్‌తో కూడిన ప్రశ్నపత్రం కోడ్‌ను ఓఎంఆర్ షీట్‌లో నమోదు చేసి, ఆ మేరకు వృత్తాల్ని బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో బబ్లింగ్ చేయాలి. ప్రశ్నపత్రం బుక్‌లెట్ సిరీస్ నంబరు ఓఎంఆర్‌లో రాసి, సర్కిల్స్‌ను సరిగా బబ్లింగ్ చేయకున్నా, సర్కిల్స్ సరిగా నింపి బుక్‌లెట్ సిరీస్ నంబరు రాయకున్నా.. ఒక్క అంకెను తప్పించినా ఆ ఓఎంఆర్‌ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ వెల్లడించింది.


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

❂ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 10.15 గంటలకే గేటు మూసివేస్తారు. అభ్యర్థులను లోపలికి అనుమతించరు.

❂ అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి. కలర్ ప్రింట్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ప్రింట్ కాకుంటే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి. లేకుంటే ఆ అభ్యర్థిని అనుమతించరు.

❂ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు ముందుగా హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి.

❂ ప్రిలిమినరీ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నాకే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రిలిమినరీ రాసేటపుడు తీసుకున్న బయోమెట్రిక్‌, మెయిన్స్‌కి వచ్చినపుడు తీసుకునే దానితో సరిపోలితేనే ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. 

❂ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలి. బూట్లు వేసుకోకూడదు.

❂ చేతులకు, కాళ్లకు గోరింటాకు, సిరా, టాటూస్‌ లాంటి అలంకరణలు ఉండకూడదు, ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు. 

❂ ప్రశ్నపత్రం తెరవగానే అందులో 150 ప్రశ్నలు ముద్రించారా? లేదా? చూసుకోవాలి. పొరపాట్లు ఉంటే మరొకటి అడిగి తీసుకోవాలి.

❂ అభ్యర్థులు ఓఎంఆర్ పత్రంలో వైట్నర్‌, చాక్ పౌడర్‌, బ్లేడ్, రబ్బరు వాడితే ఆ పత్రాన్ని అనర్హమైనదిగా గుర్తించి, మూల్యాంకనానికి పరిగణించరు. 

❂ ప్రశ్నపత్రంపై జవాబులను ఎట్టిపరిస్థితుల్లో మార్కు చేయకూడదు. ఓఎంఆర్ షీట్లో పేర్కొన్న స్థలంలో కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా, ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.

❂ అభ్యర్థుల ఓఎంఆర్; షీట్ల డిజిటల్ ఇమేజ్ స్కానింగ్ అనంతరం డిజిటల్ ఓఎంఆర్ కాపీలను కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది. 

❂ పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లడానికి అనుమతించరు. 


గ్రూప్-1 పరీక్ష OMR షీట్ నమూనా

Also Read:

TSPSC AE Jobs: తెలంగాణలో 837 ఇంజినీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!O
తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి సెప్టెంబరు 12న నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


TSPSC Recruitment: 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!

తెలంగాణ స్టేట్ ​పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్ ​మరో భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


TSPSC Jobs: తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 20 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


APPSC Recruitment: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!

ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 10 Oct 2022 09:33 AM (IST) Tags: TSPSC TSPSC Jobs TSPSC Recruitment Group1 Prelims Hall Ticket Group1 Exam Hall Ticket TSPSC Group1 Exam Instructions TSPSC Group1 Hall Tickets TSPSC Group1 Instructions

సంబంధిత కథనాలు

WDCWD: హైదరాబాద్ డిస్ట్రిక్ట్  చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!

WDCWD: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!

పని లేని సిబ్బంది కోసమే ఆ జీవో- ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాల తొలగింపుపై ప్రభుత్వం క్లారిటీ

పని లేని సిబ్బంది కోసమే ఆ జీవో- ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాల తొలగింపుపై ప్రభుత్వం క్లారిటీ

MJPTBCWREIS: గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో టీచింగ్ పోస్టులు, వివరాలివే!

MJPTBCWREIS: గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో టీచింగ్ పోస్టులు, వివరాలివే!

KTR Letter To Youth: తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

KTR Letter To Youth: తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

Lab Technician Posts: ఏపీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

Lab Technician Posts: ఏపీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు