By: ABP Desam | Updated at : 20 Jan 2023 02:33 PM (IST)
Edited By: omeprakash
టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ఎగ్జామ్ 2022
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి జనవరి 22న నిర్వహించనున్న రాతపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి జనవరి 19న ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. OMR విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు పేపర్-1కు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆ తరవాత గేట్లు మూసివేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ; పేపర్-2 ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
TSPSC AEE పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష వివరాలు...
➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్): ఉదయం 10 గం. నుంచి 12.30 గం. వరకు.
➥ పేపర్-2 (అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు): ఉదయం 10 గం. నుంచి 12.30 గం. వరకు.
➥ పరీక్ష కేంద్రాలు: కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి.
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
అభ్యర్థులకు సూచనలు..
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. ఎందుకంటే పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు పేపర్-1కు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకే అనుమతించనున్నారు. అంటే పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే అభ్యర్థులు పరీక్ష హాల్‌లో ఉంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లకు అనుమతిలేదు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు తీసుకొస్తే వారిని డిబార్ చేస్తారు.
➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన పరీక్ష నిబంధనల గురించి క్షుణ్నంగా చదవాలి. వాటిని పాటించాల్సిందే.
➥ పరీక్ష కేంద్రాన్ని చివరిక్షణంలో వెత్తుక్కోవడం కన్నా.. ముందుగానే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవడం ఉత్తమం.
➥ హాల్‌టికెట్ మీద ఫోలో స్పష్టంగా లేనివారు, ఫోటో చిన్నగా ఉన్నవారు, ఫోట్ లేనివారు, సంతకం లేనివారు పరీక్షకు వచ్చేప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంటతీసుకెళ్లాలి. గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్‌తోపాటు అండర్‌టేకింగ్ తీసుకోవాలి. దాన్ని పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి. అలాకాని పక్షంలో పరీక్షకు అనుమతించరు.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
Also Read:
➥ తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
➥ తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
➥ 8039 పోస్టులకే 'గ్రూప్-4' నోటిఫికేషన్ - అర్హతలు, దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
TS GENCO: జెన్కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>