By: ABP Desam | Updated at : 19 Sep 2023 01:19 PM (IST)
Edited By: omeprakash
టీఎస్ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డీఎస్సీ పరీక్షను నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించునున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు...
➥ ఆదిలాబాద్: 275
➥ ఆసిఫాబాద్: 289
➥ భద్రాద్రి కొత్తగూడెం: 185
➥ హనుమకొండ: 54
➥ హైదరాబాద్: 358
➥ జగిత్యాల: 148
➥ జనగాం: 76
➥ జయశంకర్ భూపాలపల్లి: 74
➥ జోగులాంబ: 146
➥ కామారెడ్డి: 200
➥ కరీంనగర్: 99
➥ ఖమ్మం: 195
➥ మహబూబాబాద్: 125
➥ మహబూబ్ నగర్: 96
➥ మంచిర్యాల: 113
➥ మెదక్: 147
➥ మేడ్చల్: 78
➥ ములుగు: 65
➥ నాగర్ కర్నూల్: 114
➥ నల్గొండ: 219
➥ నారాయణపేట: 154
➥ నిర్మల్: 115
➥ నిజామాబాద్: 309
➥ పెద్దపల్లి: 43
➥ రాజన్న సిరిసిల్ల: 103
➥ రంగారెడ్డి: 196
➥ సంగారెడ్డి: 283
➥ సిద్దిపేట: 141
➥ సూర్యాపేట: 185
➥ వికారాబాద్: 191
➥ వనపర్తి: 76
➥ వరంగల్: 138
➥ యాదాద్రి: 99
ALSO READ:
డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు, విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశముంది. తాజా నిర్ణయంతో బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఎన్సీటీఈ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా అమలు కానుంది. తెలంగాణలో 6,612 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
PGCIL: పీజీసీఐఎల్లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
SSC CHSL 2023 Result: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 'టైర్-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక
VCRC Recruitment: వీసీఆర్సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
ICMR: ఐసీఎంఆర్-ఎన్ఐఆర్టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు
UPSC Exam Calender: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
/body>