Govt Jobs Notification 2022: మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల శాఖలో ఉద్యోగం, రూ. 2 లక్షల జీతం
డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు లక్షల జీతంతో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.
Dept of Animal Husbandry Dairying and Fisheries Recruitment 2022
మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ కమిషనర్ (డెయిరీ డెవలప్‌మెంట్) ఉద్యోగం కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు 67 రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు జీతం తీసుకునే ఛాన్స్ ఉంది.
ఉద్యోగం వివరాలు
ఎవరు ఆఫర్ చేశారు: మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పోస్ట్ పేరు: అసిస్టెంట్ కమిషనర్ (డెయిరీ డెవలప్‌మెంట్)
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 13, 2022
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 60 రోజుల్లోపు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే!
ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఎవరు అర్హులంటే ?
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి అభ్యర్థులు డెయిరీ సైన్స్ లేదా టెక్నాలజీలో నాలుగేళ్ల డిగ్రీ కలిగి ఉండాలి. డెయిరీ ప్లాంట్‌లో టెక్నికల్ ఆఫీసర్, డెయిరీ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ లేదా ప్రొడక్షన్ మేనేజర్‌గా ఐదేళ్ల అనుభవం ఉండాలి. మిల్క్ ఫెడరేషన్ లేదా యూనియన్‌లో డిప్యూటీ మేనేజర్ లేదా మేనేజర్‌నైనా పని చేసి ఉండాలి.
అసిస్టెంట్ కమిషనర్ (డెయిరీ డెవలప్‌మెంట్) పోస్టుకు వయోపరిమితి:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నాటికి డిప్యుటేషన్ నియామకాల (స్వల్పకాలిక ఒప్పందాలతో సహా) గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలు.
అసిస్టెంట్ కమిషనర్ శాలరీ:
అసిస్టెంట్ కమిషనర్ జీతం రూ. 67, 700 నుంచి 2, 08,700వరకు ఉండే అవకాశం ఉంది.
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ:
కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థలు, కౌన్సిల్‌లు/పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లు, సెమీ-గవర్నమెంట్, అటానమస్, చట్టబద్ధమైన సంస్థలలోని అధికారులు స్వల్పకాలిక కాంట్రాక్ట్ పద్దతిలో డిప్యుటేషన్‌పై బదిలీ కావచ్చు.
Also Read:ఇంటర్, ఐటీఐ అర్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో అప్రెంటిషిప్‌న, విద్యార్థులకు మంచి ఛాన్స్
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, సీఐఎస్ఎఫ్ లో 1149 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Also Read: సీటెట్ డిసెంబర్ 2021 రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి, పూర్తి వివరాలు ఇవే