అన్వేషించండి

TS Group-I : గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్, దరఖాస్తుల్లో సవరణలకు ఛాన్స్

TS Group-I : గ్రూప్-1 అభ్యర్థులు టీఎస్పీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు మూడు రోజుల పాటు అవకాశం కల్పించింది.

TS Group-I : అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు సరి చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. గ్రూప్-1 అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లను ఎడిట్‌ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. అయితే ఎడిట్ చేసుకునేందుకు తగిన సర్టిఫికేట్లు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్పీ ఇప్పటికే ప్రకటించింది. మెయిన్స్‌ పరీక్షలను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు వెల్లడించింది.  

అక్టోబర్ 16న ప్రిలిమ్స్ 

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ. అక్టోబరు 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్‌-1 పరీక్ష కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణంగా గ్రూప్ -1 పరీక్షలు కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జూన్‌ 4 నాటికి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒక్కోపోస్టుకు సరాసరి 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

503 పోస్టులు 

తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్ లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇందులో 225 మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ పోస్టులకు 1,51,192 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. దివ్యాంగుల కేటగిరీలో 24 పోస్టులకు 6,105 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీపడనున్నారు. ఈసారి గ్రూప్ -1 పోస్టులుకు 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 

Also Read : Agnipath scheme: 'అగ్నిపథ్‌'కు రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు- ఒక్క వాయుసేనలోనే 7.5 లక్షలు!

Also Read : APPSC Group 1- 2018: గ్రూప్-1 పరీక్షా ఫలితాలు విడుదల- నాలుగేళ్ల నిరీక్షణకు తెర

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Embed widget