అన్వేషించండి

TS TET Notification: తెలంగాణ టెట్ - 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది.

TS TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2024 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మార్చి 14న విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్  నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్  విడుదల కావడం విశేషం. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

టీఎస్ టెట్- 2024 షెడ్యూలు..

➥ టెట్- 2024 నోటిఫికేషన్ వెల్లడి: 14.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2024.

➥ టెట్-2024 పరీక్ష నిర్వహణ: 20.05.2024 - 03.06.2024.

టెట్ నిర్వహణపై హరీశ్‌రావు లేఖ..
ఇదే విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు.. సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ కూడా రాశారు. టెట్‌ నిర్వహించక పోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను అనేకమంది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుడు సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టెట్‌ నిర్వహించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్‌ నిర్వహించలేదని పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 50 వేల మంది ఉన్నారని వివరించారు. టెట్‌ నిర్వహిస్తే ఇందులో అర్హత సాధించిన వారందరూ డీఎస్సీ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డీఈడీ, బీఈడీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. డీఎస్సీ కంటే ముందుగానే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

డీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు..
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC) పరీక్షకు తేదీలు ఖరారయ్యాయి. డీఎస్సీ పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్  విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు చొప్పున భర్తీ చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఎస్సీ రాసేందుకు టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మందికి ఊరట లభించే అవకాశం ఉంది. 

డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో.. కనీసం 10 రోజులపాటు పరీక్షలు జరుగనున్నాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, డగఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP DesamInd vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
Narne Nithin Engagement: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
Canada News: కెనడాలో దారుణం- ఆలయంలో హిందువులపై దాడి- ఖలిస్తానీలు గీత దాటారంటూ ఎంపీ వార్నింగ్
కెనడాలో దారుణం- ఆలయంలో హిందువులపై దాడి- ఖలిస్తానీలు గీత దాటారంటూ ఎంపీ వార్నింగ్
APTET Results: ఏపీ టెట్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి
ఏపీ టెట్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి
Mahindra Thar Roxx: సేల్స్‌లో దూసుకుపోతున్న థార్ - మార్కెట్లో విపరీతమైన డిమాండ్!
సేల్స్‌లో దూసుకుపోతున్న థార్ - మార్కెట్లో విపరీతమైన డిమాండ్!
Embed widget