అన్వేషించండి

TS Jobs: గుడ్ న్యూస్, త్వరలో 738 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

డీఎల్‌ 491, సాంకేతిక విద్యలో 247 ఖాళీల భర్తీకి సన్నాహాలు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ. కమిషన్‌కు వివరాలను అందజేసిన అధికారులు

తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. ఈ సారి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీచేయనుంది. డిగ్రీ లెక్చరర్‌ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు ఇటీవలే టీఎస్‌పీఎస్సీకి అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 పోస్టులుండగా, 1,255 రెగ్యులర్‌,812 కాంట్రాక్ట్‌, 1,940 గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు.


Also Read: ITBP: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!


రెగ్యులర్‌ పోస్టులను 2012లో భర్తీచేశారు. తాజాగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినివ్వడంతో లెక్చరర్ల కొరత తీరనుంది. ఇటీవలి కాలంలో పలు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంసెట్‌లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ కోర్సును ఎంచుకొంటున్నారు. ఈ కోర్సును 129 కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కానీ బోధించేందుకు 50 మంది లెక్చరర్స్‌ మాత్రమే ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పలు కోర్సులు, సబ్జెక్టుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు నెట్‌, సెట్‌ లేదా పీహెచ్‌డీ అర్హతను తప్పనిసరిచేశారు.


Also Read: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!

ఎంటెక్‌ పూర్తిచేస్తే కొత్త పేస్కేల్‌..
ప్రస్తుతానికి తెలంగాణలోని 54 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 3,647 పోస్టులు ఉండగా.. వీటిలో 1100 పైచిలుకు లెక్చరర్లు రెగ్యులర్‌ కాగా, కాంట్రాక్ట్‌ పద్ధతిలో 405 లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఈ కళాశాలల్లో 247 పోస్టుల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ పోస్టుల్లో ఎంటెక్‌ అర్హత ఉన్న వారికి కొత్త పేస్కేల్‌ను వర్తింపజేస్తున్నారు. బీటెక్‌ పూర్తిచేసిన వారికి ప్రారంభవేతనం రూ. 56,100, ఎంటెక్‌ చదివిన వారికి రూ. 57,700 చెల్లించనున్నారు.


సాంకేతిక విద్యాశాఖలో
సాంకేతిక విద్యాశాఖలో మొత్తం 247 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సివిల్‌ ఇంజినీరింగ్‌-82, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌-24, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌-41, మెకానికల్‌-36, ఆటోమొబైల్‌-15 పోస్టులతో పాటు మరికొన్ని కలిపి మొత్తం 247 పోస్టులున్నాయి.


డీఎల్‌ పోస్టులివే..
ఇక డిగ్రీ కళాశాల్లో మొత్తం 491 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లయిన్సెస్‌-311, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌-39, ఇంగ్లిష్‌-23, తెలుగు-27, సంస్కృతం-23, డేటా సైన్స్‌-12 సహా మరికొన్ని కలిపి 491 పోస్టులున్నాయి.

 

Also Read:

BHEL: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు, పోస్టులు-అర్హతల వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్(భారత వాతావరణ శాఖ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ R&D, వాతావరణ శాస్త్రం మరియు దాని అనుబంధ ప్రోగ్రామ్‌లలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ “III”, ప్రాజెక్ట్ సైంటిస్ట్“II”, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు“I”, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) ఖాళీలను భర్తీ చేస్తారు.పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget