BHEL Recruitment: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు అర్హతలివే!
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు...
* మొత్తం ఖాళీల సంఖ్య: 150
* ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.
విభాగాల వారీగ ఖాళీలు..
మెకానికల్: 30 పోస్టులు
ఎలక్ట్రికల్: 15 పోస్టులు
సివిల్: 40 పోస్టులు
కెమికల్: 10 పోస్టులు
హెచ్‌ఆర్(HR): 10 పోస్టులు
ఫైనాన్స్: 20 పోస్టులు
ఐటీ(IT)/కంప్యూటర్ సైన్స్: 20 పోస్టులు
మెటలర్జీ ఇంజినీర్: 05 పోస్టులు
విభాగాలు: సివిల్, మెకానికల్, ఐటీ/ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్స్, కెమికల్, మెటలార్జీ, ఫైనాన్స్, హెచ్ఆర్, మెకాట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, థర్మల్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత:
1. ఇంజినీర్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 27-29 ఏళ్లు మించకూడదు.
అర్హత:
2. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 29 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05, ఓబీసీ అభ్యర్థులకు 03 ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.50000 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:13.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 04.10.2022.
పరీక్ష తేది:31.10.2022, 01.11.22, 02.11.2022.
Notification
Website
Also Read
భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు, పోస్టులు-అర్హతల వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్(భారత వాతావరణ శాఖ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ R&D, వాతావరణ శాస్త్రం మరియు దాని అనుబంధ ప్రోగ్రామ్‌లలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ “III”, ప్రాజెక్ట్ సైంటిస్ట్“II”, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు“I”, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) ఖాళీలను భర్తీ చేస్తారు.పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read
తెలంగాణలో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలు - డిప్లొమా, బీటెక్ అర్హత!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబరు 23 నుంచి అందుబాటులో ఉండనుంది.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...