News
News
X

TSPSC AE Jobs: తెలంగాణలో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలు - డిప్లొమా, బీటెక్ అర్హత!

వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

FOLLOW US: 

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ సెప్టెంబరు 23 నుంచి అందుబాటులో ఉండనుంది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              వివరాలు...

మొత్తం ఖాళీలు: 833

* అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: 434 పోస్టులు 

విభాగాలవారీగా పోస్టుల వివరాలు..

1)  అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్):  62 పోస్టులు
     
 విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ(సివిల్)

2)  అసిస్టెంట్ ఇంజినీర్: 41 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్.

3) అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.

4) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 29 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .

5) టెక్నికల్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .

Also Read:  TSPSC: తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

6)  అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులు

విభాగం:  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.

7) అసిస్టెంట్ ఇంజినీర్: 227 పోస్టులు

విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 

8) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 12 పోస్టులు

విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.

9)  అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు

విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్

10) అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు

విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

అర్హత: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.45960-రూ.124150 చెల్లిస్తారు.

Also Read: TSPSC: 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!* జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399 పోస్టులు

1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:  27 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ.

2) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 68 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్

3) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 32 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.

4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 212 పోస్టులు

విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 

5) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60 పోస్టులు

విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

అర్హత: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18-44 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.32810-రూ.96890 చెల్లిస్తారు.

Also Read:   TSPSC: మహిళలకు గుడ్‌న్యూస్ - టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్, రూ.50 వేలకు పైగా జీతం!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

* వెబ్ నోటిఫికేషన్: 12.09.2022

* పూర్తి వివరాలతో నోటిఫికేషన్: 23.09.2022.

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2022

* దరఖాస్తు చివరి తేది: 21.10.2022.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 13 Sep 2022 07:30 AM (IST) Tags: Telangana Jobs Government Jobs TSPSC Jobs TSPSC Recruitment 2022 TSPSC AE Recruitment 2022

సంబంధిత కథనాలు

TSRTC Jobs: ఆర్టీసీలో అప్రెంటిస్‌ పోస్టులు, డిగ్రీ ఏదైనా సరే!

TSRTC Jobs: ఆర్టీసీలో అప్రెంటిస్‌ పోస్టులు, డిగ్రీ ఏదైనా సరే!

TMC Jobs: విశాఖపట్నం టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ఖాళీలు, పోస్టులివే

TMC Jobs: విశాఖపట్నం టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ఖాళీలు, పోస్టులివే

CDAC: సీడాక్‌‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

CDAC: సీడాక్‌‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

Railway Jobs: సదరన్‌ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ ఖాళీలు, ఐటీఐ అర్హత!

Railway Jobs: సదరన్‌ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ ఖాళీలు, ఐటీఐ అర్హత!

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, అర్హతలివే!

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్