TGPSC TPBO Verification: టీపీబీవో పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి, ధ్రువపత్రాల పరిశీలన ఎప్పటినుంచంటే?
TPBO DV: టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుల భర్తీకి నిర్వహించను ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూలును, అభ్యర్థుల జాబితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 21న విడుదల చేసింది.
TSPSC TPBO Certificates Verification: తెలంగాణ మున్సిపల్ శాఖలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (TPBO) పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ జూన్ 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను పొందుపరిచింది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా మొత్తం 175 పోస్టులకు 1:2 నిష్పత్తిలో 348 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయంలో మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. అది తప్పితే మరే ఇతర అవకాశం ఉండదు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 28 నుంచి జులై 2వ తేదీ వరకు హైదరాబాద్ టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసిన అభ్యర్థులను మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనలో పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు జూన్ 26 నుంచి వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ప్రతిరోజు 90 మంది చొప్పున సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తారు. చివరిరోజైన జులై 2న మాత్రం 78 మంది సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు సెషన్లు ప్రారంభమవుతాయి.
సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో చివరికి జులై 8న నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో కమిషన్ వెల్లడించింది. తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను, షెడ్యూలును టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే వేదిక: Office of the Telangana Public Service Commission,
M.J. Road, Nampally, Hyderabad.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం..
1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.
2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ
3) పరీక్ష హాల్‌టికెట్
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో.
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి.
6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో.
7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).
8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.
9) అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు EWS సర్టిఫికేట్ అవసరం.
10) వయోసడలింపుకు సంబంధించిన తగిన ఆధారాలు కలిగి ఉండాలి.
11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి.
12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి
13) వెబ్ఆప్షన్లు నమోదుచేసిన అభ్యర్థులను మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనలో పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు జూన్ 26 నుంచి వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
14) నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి.