TGPSC AMVI Medical Tests: అసిస్టెంట్ మోటార్ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్ మెడికల్ టెస్టులకు ఎంపికైంది వీరే, షెడ్యూలు ఇదే
TSPSC: అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించే వైద్యపరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్షల షెడ్యూలును ప్రకటించింది.
AMVI Medical Tests: తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ టెస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ జూన్ 28న విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెడికల్ టెస్టులకు మొత్తం 326 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి జులై 1 నుంచి 8 వరకు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు జూన్ 12, 13 తేదీల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో నుంచి మెడికల్ టెస్టులకు కమిషన్ అభ్యర్థులను ఎంపికచేసింది. ఏరోజు ఎవరికి వైద్య పరీక్షలు నిర్వహించనుందో షెడ్యూలు ప్రకటించింది.
AMVI మెడికల్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి ..
The candidates who have attended for Verification of Certificates for Recruitment to post of Assistant Motor Vehicles Inspector in Transport Department, Notification No. 31/2022, dated: 31/12/2022, are informed to appear before the Medical Board at Room No. 507 in Osmania General Hospital, Hyderabad for verification of physical standards prescribed for the post which is scheduled to be held from 01/07/2024 to
|
రాష్ట్రంలో 113 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు గతేడాది జూన్ 28న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగు జిల్లాల్లోని 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 76 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాతపరీక్షకు సంబంధించి మొత్తం 5,572 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. పేపర్-1 పరీక్షకు 4734 (76.52 శాతం), పేపర్-2 పరీక్షకు 4722 (76.32శాతం) మంది హాజరయ్యారు. రాత పరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ జులై 3న వెల్లడించింది. జులై 6 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను 2024 ఫిబ్రవరి 16న విడుదల చేసింది. ఆ తర్వాత ఎంపికచేసిన అభ్యర్థలుకు జూన్ 12, 13 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించింది.