TGPSC Librarian Results: లైబ్రేరియన్ పోస్టుల తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
TGPSC: తెలంగాణ ఇంటర్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది
TGPSC Librarian Posts Selection Results: తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 9న విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 64 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసింది. ఇందులో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విభాగానికి సంబంధించి 38 పోస్టుల్లో మల్టీజోన్-1 పరిధిలో 18 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 20 పోస్టులను భర్తీచేశారు. ఇక టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జోన్ 1(కాళేశ్వరం)-01, జోన్-2(బాసర)-03, జోన్-3(రాజన్న)-06, జోన్-4(భద్రాద్రి)-06, జోన్-5(యాదాద్రి)-03, జోన్-6(చార్మినార్)-07, జోన్-7(జోగుళాంబ)-03 పోస్టులను భర్తీచేశారు. రాతపరీక్ష ద్వారా 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ మార్చి 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 5న, ఆగస్టు 31న ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించారు. తాజాగా ఎంపిక ఫలితాలను కమిషన్ విడుదల చేసింది.
లైబ్రేరియన్ పోస్టుల ఎంపిక ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
పోస్టుల వివరాలు..
* లైబ్రేరియన్
ఖాళీల సంఖ్య: 71
విభాగాల వారీగా ఖాళీలు:
1) లైబ్రేరియన్: 40 పోస్టులు
విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్.
2) లైబ్రేరియన్: 31 పోస్టులు
విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యకేషన్.
పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్ - ఎంఎల్‌ఐఎస్సీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
జీతం:
⏩లైబ్రేరియన్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పోస్టులకు రూ.54,220 - రూ.1,33,630.
⏩ లైబ్రేరియన్ టెక్నికల్ ఎడ్యకేషన్ పోస్టులకు లెవల్-9ఎ అర్హతకు రూ.56,100, లెవల్-10 అర్హత ఉన్నవారికి రూ.57,700 ఇస్తారు.
ALSO READ:
టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ కొలువులు, అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 39,481 ఖాళీలను భర్తీచేయనుంది. మొత్తం ఖాళీల్లో పురుషులకు 35,612 పోస్టులు; మహిళలకు 3,869 పోస్టులు కేటాయించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 15,654 పోస్టులు; సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 7,145 పోస్టులు; సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో 11,541 పోస్టులు; సశస్త్ర సీమాబల్‌లో 819 పోస్టులు; ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్‌లో 3,017 పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో 1,248 పోస్టులు; స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌లో 35 పోస్టులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 22 పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..