TS Post Office Recruitment: తెలంగాణలో టెన్త్ అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు.. రూ.81 వేల వరకూ జీతం..
Post office jobs: తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 55 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణ సెప్టెంబర్ 24తో ముగియనుంది.
![TS Post Office Recruitment: తెలంగాణలో టెన్త్ అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు.. రూ.81 వేల వరకూ జీతం.. Telangana Post Office Recruitment 2021 for MTS, LDC, Postal/Sorting Assistant, Postman, Mail Guard Apply @tsposts.in TS Post Office Recruitment: తెలంగాణలో టెన్త్ అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు.. రూ.81 వేల వరకూ జీతం..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/02/3b418a8e20af810e570d001dd98fe419_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో పోస్టల్ సర్కిల్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 55 పోస్టులను భర్తీ చేయనుంది. వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 24వ తేదీతో ముగియనుంది. పోస్టల్ అసిస్టెంట్ (పీఏ), సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్ఏ), పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం https://tsposts.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్, సైక్లింగ్, చెస్, ఫుట్ బాల్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, కరాటే, రెజ్లింగ్, రగ్బీ, టెన్నిస్ తదితర (మొత్తం 64 క్రీడలు ఉన్నాయి) క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండటం తప్పనిసరి అని నోటిఫికేషన్లో తెలిపింది.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు..
పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్– 26
పోస్టల్ అసిస్టెంట్– 11
సార్టింగ్ అసిస్టెంట్– 08
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) – 10
వేతనం వివరాలు..
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం చెల్లిస్తారు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులకు ఎంపికైన వారికి రూ. 18000 నుంచి రూ.56,900 వరకు నెలవారీ వేతనం ఉంటుంది. ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
విద్యార్హత, వయోపరిమితి..
విద్యార్హత పోస్టులను బట్టి మారుతోంది. టెన్త్, ఇంటర్మీడియట్, తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాష (తెలుగు) తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే.. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు ఉండాలి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఓబీసీలకు మూడేళ్లు.. ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్ల వయోపరిమితి అందించారు.
Also Read: SSC GD Constable Recruitment: ఎస్ఎస్‌సీలో 25,271 కానిస్టేబుల్ జాబ్స్.. ఇవాల్టితో గడువు ముగియనుంది. అప్లై చేశారా?
Also Read: APEPDCL Recruitment 2021: ఇంటర్, ఐటీఐ చేసిన వారికి గుడ్‌న్యూస్.. ఏపీ విద్యుత్ సంస్థలో 398 జాబ్స్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)