అన్వేషించండి

SSC GD Constable Recruitment: ఎస్ఎస్‌సీలో 25,271 కానిస్టేబుల్ జాబ్స్.. ఇవాల్టితో గడువు ముగియనుంది. అప్లై చేశారా?

STAFF SELECTION COMMISSION Notification 2021: పదో తరగతి అర్హతతో ఎస్ఎస్‌సీలో 25,271 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు గడువు ఈ రోజుతో (ఆగస్టు 31) ముగియనుంది. 

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ అందించింది. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25,271 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పదో తరగతి పాస్ అయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎంపికైన వారి వేతనం (పే లెవల్ 3 ప్రకారం) నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు చెల్లిస్తారని తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు గడువు ఈ రోజుతో (ఆగస్టు 31) ముగియనుంది. 
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సహస్త్ర సీమా బల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) తదితర విభాగాల్లో కానిస్టేబుళ్ల నియామకానికి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 22,424 పోస్టులు.. మహిళలకు 2847 పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఖాళీల వివరాలు..
బీఎస్ఎఫ్ (BSF) - 7,545
సీఐఎస్ఎఫ్ (CISF) - 8,464
ఎస్ఎస్ బీ (SSB) - 3,806
ఐటీబీపీ (ITBP) - 1,431
ఏఆర్ (Rifleman in Assam Rifles) - 3,785
ఎస్ఎస్ఎఫ్ (SSF) - 240
మొత్తం పోస్టుల సంఖ్య - 25,271

పరీక్ష విధానం: 
కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ & రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీ అని నాలుగు విభాగాలు ఉంటాయి. వీటిలో ఒక్కో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. 
ముఖ్యమైన వివరాలు.. 
అర్హత: 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో తెలిపింది. మిగతా వారు రూ.100 చెల్లించాలి. 
దరఖాస్తులకు ఆఖరు తేదీ: ఆగస్టు 31, 2021
ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2021
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్ ఎగ్జామ్ (Computer Based Examination), ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్ (Physical Efficiency Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (Phusical Standard Test), మెడికల్‌ ఎగ్జామినేషన్ (Medical Examination), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: 
ఆంధ్రప్రదేశ్‌: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
New Rules: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం, ప్రతి 10 కి.మీకు స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం, ప్రతి 10 కి.మీకు స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు
Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Embed widget