TS JOBS: వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి: మంత్రి హరీశ్‌రావు
ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీలో వేగం పెంచాలని సూచించారు. గ్రూప్-3, గ్రూప్-4 ఇంజినీర్ల నియామకాల నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని చెప్పారు
![TS JOBS: వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి: మంత్రి హరీశ్‌రావు Telangana minister harish rao review on government job notifications TS JOBS: వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి: మంత్రి హరీశ్‌రావు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/bcba86159e53c01c9dd38159ddb0f7241661536153618522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి హరిశ్‌రావు అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీలో వేగం పెంచాలని సూచించారు. గ్రూప్-3, గ్రూప్-4 ఇంజినీర్ల నియామకాల నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆగస్టు 26న బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, వివిధ నియామక సంస్థల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే గ్రూప్-1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.
Also Read:
DRDO Recruitment: డీఆర్‌డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పురోగతిపై హరీశ్‌రావు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 50వేల నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. అందులో సగం కూడా నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also Read: AP DSC Jobs: ఏపీ ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్ పోస్టులు
నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ సహా నియామక సంస్థల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గ్రూప్-3, 4 సహా, ఇంజినీర్ల నియామకం, గురుకులాలు సహా ఇతర నోటిఫికేషన్ల విషయంలో ఆలస్యం చేయవద్దని ఆదేశించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని, సర్వీసు నిబంధనలు సహా ఇతర అంశాలకు సంబంధించి ఏవైనా సవరణలు అవసరమైతే చేయాలని మంత్రి చెప్పినట్లు సమాచారం. ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి జోన్లు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలు వీలైనంత త్వరగా అందించాలని సంబంధిత అధికారులను హరీశ్ రావు ఆదేశించినట్లు తెలిసింది.
Also Read:
SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)