TSPSC Group 1 Exam: ప్రశాంతంగా ముగిసిన 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 75 శాతం హాజరు నమోదు!
తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో హాజరును నమోదుచేశారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో బయో మెట్రిక్ ట్యాబ్ లు పనిచేయలేదు. అభ్యర్థుల థంబ్స్‌ను ట్యాబ్ తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్-1 ఎగ్జామ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింది. సెంటర్ల దగ్గర చివరి నిమిషంలో అభ్యర్థులు హడావుడి పడ్డారు. కొన్ని సెంటర్ల దగ్గర బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడంలో ఆలస్యమైంది. ట్యాబ్ లలో ఛార్జింగ్ లేకపోవడం, మరికొన్ని స్లోగా ఉండడంతో ఈ ప్రాసెస్ లేట్ అయింది. చెప్పిన టైంలోపల ఎగ్జామ్ సెంటర్ గేట్ లోనికి వెళ్లిన వారిని అనుమతించారు. 10.15 నిమిషాలకు సెంటర్ లోపలికి వెళ్లాలన్న నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడ్డారు.
లోపల తల్లులు ఎగ్జామ్ రాస్తుంటే... బయట వారి పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ ఆడిస్తూ కనిపించారు. మరోవైపు వర్షం కారణంగా కొందరు అభ్యర్థులు లేట్ అయ్యారు. మరికొందరికి సెంటర్ అడ్రస్ లు సరిగా దొరకకపోవడంతో ఆలస్యమయ్యారు. దీంతో వారందరినీ తిప్పి పంపారు. కొందరు అభ్యర్థులైతే కొన్ని సెకన్ల గ్యాప్ తో ఎగ్జామ్ మిస్ అయ్యారు. గతంలో 1 నిమిషం నిబంధన ఉండేదని, ఇప్పుడు 15 నిమిషాల లేట్ రూల్ తీసుకొచ్చారని ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అంటున్నారు. తాము టైంకే వచ్చినా లోపలికి అనుమతించలేదని ఆబిడ్స్ స్టాన్లీ కాలేజ్ దగ్గర అభ్యర్థులు వాపోయారు.
కొన్నిచోట్ల సతాయించిన బయోమెట్రిక్...
తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరును నమోదుచేశారు. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో బయో మెట్రిక్ ట్యాబ్ లు పనిచేయలేదు. సగానికిపైగా అభ్యర్థుల థంబ్స్‌ను ట్యాబ్ తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు పరీక్షకు సమయం దగ్గరపడుతుండటం మరోవైపు థంబ్ అటెండెన్స్ లో ఇబ్బందులు ఎదురవుతుండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.
నిజాం కాలేజీలో గ్రూప్-1 పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు థంబ్ పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో అభ్యర్థి ఎన్నిసార్లు వేలిముద్రలు వేసినా పడకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ట్యాబ్‌లో ఇబ్బందులు తలెత్తడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్‌లో వేచి చూశారు. పరీక్ష సమయం అవుతున్నందున తొందరగా పంపాలని కోరుకున్నా.. అధికారులు వినిపించుకోకపోవడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరును నమోదుచేస్తుండటంతో ఉదయం 10.15 గంటలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని టీఎస్‌పీఎస్సీ ముందుగానే సూచించింది. దీంతో అభ్యర్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు.
పలు ప్రాంతాల్లో 10.15 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. మొత్తం 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫకేషన్ విడుదల చేసింది. దీనికోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 1019 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
కాగా హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత కోసం సీసీ కెమెరాల నీడలో ఈ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. అన్ని కేంద్రాల్లోని సీసీ కెమెరాలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. అలాగే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సైతం అనుసంధానం చేశారు.
Also Read:
TSPSC AE Jobs: తెలంగాణలో 837 ఇంజినీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 12న నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Recruitment: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Jobs: తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 20 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC Recruitment: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..