Telangana Jobs 2022: నిరుపేద అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త - లక్ష మందికి ఫ్రీ కోచింగ్
Free Coaching For Job Seekers Telangana Jobs 2022: పేద విద్యార్థులు ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదని, సీఎం కేసీఆర్ మార్గదర్శకాల ప్రకారం స్టడీ సెంటర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు అలోక్ కుమార్.
Telangana Jobs 2022: తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. లక్ష మంది నిరుపేద ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ అందించాలని బీసీ సంక్షేమశాఖ అందుకు కార్యాచరణను రూపొందించింది. వెనుకబడిన తరగతికి చెందిన నిరుద్యోగ యువతకు ఆఫ్‌లైన్ ద్వారా 50 వేల మందికి, ఆన్‌లైన్ ద్వారా 50 వేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 80,039 ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడంతో ఉద్యోగార్థులు మెరుగైన శిక్షణ కోసం ఎదురుచూస్తున్నారు.
పేద విద్యార్థుల కోసం ఫ్రీ కోచింగ్..
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో భారీ మొత్తంలో ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్ అన్నారు. ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద విద్యార్థులు ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదని, సీఎం కేసీఆర్ మార్గదర్శకాల ప్రకారం స్టడీ సెంటర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆఫ్ లైన్, ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగ అభ్యర్థులకు పేద, మధ్యతరగతికి చెందిన లక్ష మంది ఉద్యోగార్థులకు శిక్షణ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
ఆన్‌లైన్‌లో ప్రశ్నలు..
50 వేల మంది బీసీ ఉద్యోగార్థులకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలకు సంబంధించి ప్రతిరోజూ 100 ప్రశ్నలను ఇస్తున్నారు. ఈ సేవలను ప్రారంభించిన రెండు వారాల్లోనే స్టడీ సర్కిల్ గ్రూప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 3 వేల మంది సబ్‌స్ర్కైబ్ చేసుకున్నారు.
ఆన్‌లైన్‌లో ప్రశ్నలు..
50 వేల మంది బీసీ ఉద్యోగార్థులకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలకు సంబంధించి ప్రతిరోజూ 100 ప్రశ్నలను ఇస్తున్నారు. ఈ సేవలను ప్రారంభించిన రెండు వారాల్లోనే స్టడీ సర్కిల్ గ్రూప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 3 వేల మంది సబ్‌స్ర్కైబ్ చేసుకున్నారు.
పోటీ పరీక్షలకు సంబంధించి గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంక్, యూపీఎస్సీ గతంలో ఇచ్చిన ప్రశ్నలను యూట్యూబ్ ద్వారా దాదాపు 300కు పైగా వీడియోలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. టెలిగ్రామ్ ద్వారా సైతం ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందించేందుకు చర్యలు చేపట్టారు. సామాజిక మాద్యమం ఫేస్‌బుక్ ద్వారా వీడియో రూపంలో టీచింగ్ చేయనున్నారు. త్వరలోనే ఓ యాప్ తీసుకొస్తామని బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. ‘తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్’ పేరిట యాప్ తయారైనట్లు సమాచారం. ఏప్రిల్ రెండో వారంలోగా యాప్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Also Read: Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో 2500 ఉద్యోగాలు - ఇంటర్ పాసయ్యారా, ఈ జాబ్స్ మీకోసమే