నిరుద్యోగులకు గుడ్ న్యూస్, పాఠశాల విద్యాశాఖలో 134 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్! మంత్రి హరీశ్ రావు ట్వీట్!
తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీని చేపట్టనున్నారు.
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఆయా నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. తాజాగా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం భర్తీ చేసే పోస్టుల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు (గ్రేడ్-1)- 24 పోస్టులు, డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టులు, డైట్‌లో 65 ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది. ఈ ఉద్యోగాల భర్తీకి కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ట్వీట్ చేశారు.
ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారికి శుభవార్త. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు.
Good news to job aspirants, #Telangana govt accorded permission for filling up of 134 posts under Director of School Education, by way of Direct Recruitment through TSPSC.
— Harish Rao Thanneeru (@trsharish) November 12, 2022
Deeds, not words - that's the mantra of TRS govt under #CMKCR garu's leadership. pic.twitter.com/iZtyKIbJMD
Also Read:
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లోపు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా మొత్తం 7 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వీటిలో 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 6 వేలకు పైగా నర్సు పోస్టులతోపాటు 1569 పల్లె దవాఖానాల్లో డాక్టర్లను నియమించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 3800 ఏఎన్‌ఎం కేంద్రాలను కూడా పల్లె దవాఖానాలుగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో డీపీహెచ్ పరిధిలో 751 పోస్టులు, టీవీవీపీ పరిధిలో 211 పోస్టులు, ఐపీఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి. వీరికి మరో పది రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
వాక్ ఇన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..