Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 7 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ - మంత్రి హరీశ్ రావు వెల్లడి
రాష్ట్రంలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లోపు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు..
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లోపు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా మొత్తం 7 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వీటిలో 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 6 వేలకు పైగా నర్సు పోస్టులతోపాటు 1569 పల్లె దవాఖానాల్లో డాక్టర్లను నియమించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 3800 ఏఎన్‌ఎం కేంద్రాలను కూడా పల్లె దవాఖానాలుగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో మానిటరింగ్ హబ్‌ను మంత్రి హరీశ్ రావు నవంబరు 11న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 887 పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, TSMSIDC అనుసంధానం చేశామన్నారు. తద్వారా ఉన్నతాధికారులు ఇక్కడి నుంచే మానిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణలో ప్రాథమిక వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారన్నారు. 43 పీహెచ్సీలకు 67 కోట్లతో కొత్త బిల్డింగ్ లను మంజూరు చేశామన్నారు. 372 పీహెస్సీల మరమ్మతులను రూ.43.18 కోట్లతో చేపట్టామననారు.
ఏవైనా ఔట్ బ్రేక్స్ కలిగినప్పుడు సలహాలు సూచనలు ఇస్తారన్నారు. డాక్టర్లు తమ phc లోని ఫార్మసీ, ల్యాబ్ ను మానిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందన్నారు. రాష్ట్రంలో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో డీపీహెచ్ పరిధిలో 751 పోస్టులు, టీవీవీపీ పరిధిలో 211 పోస్టులు, ఐపీఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి. వీరికి మరో పది రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 331 బస్తీ దవాఖానలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో 298, ఇతర మున్సిపాలిటీల్లో 33 పనిచేస్తున్నాయి. దవాఖానల సంఖ్యను 496కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని జనవరి నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ కాకుండా మున్సిపాలిటీల్లోనే మరో 67 బస్తీ దవాఖానలు రానున్నాయి. వీటిల్లోనూ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
Also Read:
TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్లపై బోర్డు కీలక అప్‌డేట్! వీటిని సిద్ధం చేసుకోండి!
రాష్ట్రవ్యాప్తంగా 11, 12 వేదికల్లో/ మైదానాల్లో ఫిజికల్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మరో ఒకటి రెండు కొత్త ప్రదేశాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 25 రోజుల్లో ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియను ముగించాలని అధికారులు భావిస్తున్నారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
వాక్ ఇన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..