అన్వేషించండి

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌లో బయోమెట్రిక్‌ విధానం, అవగాహన కల్పించాలని సీఎస్‌ ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ హాజరవుతున్నారని చెప్పారు. పరీక్ష సజావుగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

తెలంగాణ వ్యాప్తంగా అక్టోబరు 16న నిర్వహించనున్న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం (అక్టోబరు 11) అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ హాజరవుతున్నారని చెప్పారు.

పరీక్ష సజావుగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబరు  16న జరుగనున్న నేపథ్యంలో.. స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించి, పోలీసు రక్షణ ఏర్పాట్లుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ పరీక్షల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ప్రిలిమినరీ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నాకే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రిలిమినరీ రాసేటపుడు తీసుకున్న బయోమెట్రిక్‌, మెయిన్స్‌కి వచ్చినపుడు తీసుకునే దానితో సరిపోలితేనే ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో గ్రూప్‌–1 కేటగిరీలో 503 కొలువులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేయగా 3,80,202 మంది దరఖాస్తులు సమర్పించారు. వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూలై నెలలోనే నిర్వహించాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో, పరీక్షలను అక్టోబర్ 16కు వాయిదా వేశారు. ఈ పరీక్ష తేదీ కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష కచ్చితంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 కేటాయించారు. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమినరీ పరీక్ష నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.


:: Also Read ::

TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో మార్పులు, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
తెలంగాణలో అక్టోబరు 16న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తుుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నిర్వహించనున్న తొలి గ్రూప్-1 కావడంతో పలు మార్పులకు కమిషన్ శ్రీకారం చుట్టింది. ప్రిలిమినరీ పరీక్షకు వీలైనన్ని బహుళ సిరీస్‌లతో ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,041 పరీక్ష కేంద్రాల్లో అక్టోబరు 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 503 పోస్టులకు రాష్ట్రంలో 3,80,202 మంది హాజరుకానున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 9 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు వెబ్‌‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌  చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకు ఏర్పాటుచేసింది. 
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు పాటించాల్సిన సూచనల కోసం క్లిక్ చేయండి..


TSPSC: 'గ్రూప్-1' హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
తెలంగాణలో 'గ్రూప్‌–1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి గ్రూప్-1 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 16న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఓఎంఆర్ షీట్ విధానంలోనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
హాల్‌టికెట్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget