అన్వేషించండి

TCS: ఉద్యోగులకు టీసీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్, అలా చేస్తే ఊరుకోం!!

మూన్‌లైటింగ్ ఒక ‘నైతిక సమస్య’ అని వ్యాఖ్యానించారు. టీసీఎస్ మూల విలువలు, సాంప్రదాయాలకు ఇది విరుద్ధమని ఉద్యోగులను ఆయన హెచ్చరించారు. కాగా మూన్‌లైటింగ్‌‌కు పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదు..

ఒక ఉద్యోగి ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసే విధానం ‘మూన్‌లైటింగ్’ను వ్యతిరేకిస్తున్న దేశీయ ఐటీ దిగ్గజాల జాబితాలో టీసీఎస్ (TCS) కూడా చేరింది. రెగ్యులర్ ఉద్యోగానికి వెలుపల ప్రాజెక్టులు చేపట్టడాన్ని కంపెనీ తీవ్రంగా తప్పుబట్టింది. ఒక కంపెనీలో ఉద్యోగ ఒప్పందం కుదుర్చుకున్నాక వేరే సంస్థ కోసం పనిచేయడానికి అనుమతి ఉండదని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపినాథన్  స్పష్టం చేశారు.

మూన్‌లైటింగ్ ఒక ‘నైతిక సమస్య’ అని వ్యాఖ్యానించారు. టీసీఎస్ మూల విలువలు, సాంప్రదాయాలకు ఇది విరుద్ధమని ఉద్యోగులను ఆయన హెచ్చరించారు. కాగా మూన్‌లైటింగ్‌‌కు పాల్పడుతున్న ఉద్యోగుల తొలగింపు లేదా చర్యలపై కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదని టీసీఎస్ హెచ్ఆర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. మూన్‌లైటింగ్‌పై యాజమాన్యం అభిప్రాయం ఏంటో ఇదివరకే ఉద్యోగులకు తెలియజేశామని ప్రస్తావించారు.


:: Also Read ::  ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!


కాగా గత కొన్ని వారాలుగా దేశీయ ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న 300 మంది ఉద్యోగులను విప్రో తొలగించిన విషయం తెలిసిందే. మరో టెక్ దిగ్గజం ఐబీఎం కూడా మూన్‌లైటింగ్‌ను అనైతిక విధానంగా పేర్కొంది. కంపెనీలో చేరేముందు ఉద్యోగులు కేవలం ఐబీఎంకి మాత్రమే పనిచేస్తామనే ఒప్పందంపై సంతకం చేస్తారని ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు.

ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ట్రెండ్‌ మొదలైంది. కొందరు ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. ఈ సబ్జెట్‌పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఐటీ పరిశ్రమ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

:: Also Read ::  సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!


ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆగస్టు నెల ప్రారంభంలో తన ఉద్యోగులు మరో ప్రాజెక్టులో పనిచేసేందుకు కూడా అనుమతి ఇవ్వడంతో ఈ మూన్‌లైటింగ్ ప్రధానాంశంగా మారింది. ఈ విషయంపై ఐటీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.


IT Jobs:
ఫ్రెష‌ర్స్‌కు షాకిస్తున్న ఐటీ దిగ్గజాలు, ఆఫ‌ర్ లెట‌ర్లపై యూట‌ర్న్‌!

ఐటీ దిగ్గజ సంస్థలైన విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్ర వంటి సంస్థ ఫ్రెష‌ర్లకు షాకిస్తున్నాయి. ఉద్యోగ ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చిన త‌ర్వాత అదిగో..ఇదిగో అంటూ నియామ‌క ప్రక్రియ‌లో జాప్యం చేసిన టెక్ సంస్థలు తాజాగా యూట‌ర్న్ తీసుకున్నాయి. ఫ్రెష‌ర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను వెనక్కు తీసుకుంటున్నాయి. నెల‌ల త‌ర‌బ‌డి నియామ‌క ప్రక్రియ‌పై ముందుకు కదలని ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను తిర‌స్కరిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు, నాలుగు నెల‌ల కింద‌ట తాము ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మ‌హీంద్ర వంటి టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామ‌ని, ప‌లు రౌండ్ల ఇంట‌ర్వ్యూల త‌ర్వాత త‌మ‌కు ఆఫ‌ర్ లెట‌ర్లు ఇవ్వగా తామిప్పుడు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నామ‌ని విద్యార్ధులు చెబుతున్నారు. కాగా త‌మ ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేశామ‌ని త‌మ‌కు ఆయా కంపెనీల నుంచి లెట‌ర్స్ వ‌చ్చాయ‌ని వారు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అర్హతా నిబంధ‌న‌లు, కంపెనీ మార్గద‌ర్శకాల పేరుతో ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయ‌ని ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు.


:: Also
Read ::
 హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, ఈ అర్హత తప్పనిసరి!


అంత‌ర్జాతీయంగా ఐటీ రంగంలో మంద‌గ‌మ‌నం, వ్యయ నియంత్రణ చ‌ర్యలు చేప‌డుత‌న్న నేప‌ధ్యంలో ఈ ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. వ‌డ్డీరేట్ల పెంపు, మార్కెట్ల‌లో లిక్విడిటీ త‌గ్గుద‌ల‌, మాంద్యం ప‌రిస్ధితుల‌తో టెక్ స్టార్టప్‌ల నుంచి టెక్ దిగ్గజాల వ‌ర‌కూ ఐటీ కంపెనీలు గ‌డ్డు ప‌రిస్ధితులు ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల ప‌రిస్ధితుల‌తో ప‌లు కంపెనీలు నియామ‌కాల‌ను నిలిపివేశాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్ధలు సైతం హైరింగ్‌ను నిలిపివేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే లేఆఫ్స్ త‌ప్పవ‌నే సంకేతాల‌ను పంపడం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

 

:: Also Read ::


❂  UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, అర్హతలివే!

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

 

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget