SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 92 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, నెలకు రూ.1.8 లక్షల వరకు జీతం
SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
SAIL Special Recruitment Drive: భారత ప్రభుత్వరంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా ఓబీసీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 11న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
ఖాళీల వివరాలు..
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 92.
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-30, ఎస్టీ-25, ఓబీసీ-37.
విభాగాల వారీగా ఖాళీలు..
➙ కెమికల్ ఇంజినీరింగ్: 03
➙ సివిల్ ఇంజినీరింగ్: 03
➙ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 26
➙ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 07
➙ మెకానికల్ ఇంజినీరింగ్: 34
➙ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 05
➙ మైనింగ్ ఇంజినీరింగ్: 14
అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి ఎస్సీ, ఎస్టీలకు 33 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరాలకు మించకూడదు. ఇక దివ్యాంగులకు 10 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 45 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 - రూ.1,80,000.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాలుంటాయి. ఇందులో పార్ట్-1(అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు) 100 మార్కులు-40 నిమిషాలు, పార్ట్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్) 100 మార్కులు - 80 నిమిషాలు ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్టులో భాగంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.12.2023.
➥ ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి, 2024.
ALSO READ:
యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా
కోల్‌కతాలోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 127 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి డిసెంబరు 27లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..