అన్వేషించండి

Startup layoffs : స్టార్టప్‌ల పొలాల్లో మళ్లీ మొలకలొస్తున్నాయ్ - 70 శాతం తగ్గిన లే ఆఫ్‌లు - ఇక రిక్రూట్‌మెంట్లు ?

Tech Jobs : ఐటీ ఉద్యోగాల రంగం రిస్క్‌లో ఉంది. అమెరికా నుంచి హైదరాబాద్ వరకూ స్టార్టప్‌లలో తొలగింపులు కామన్ అయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Startup layoffs down by nearly 70 per cent : భారత ఐటీ రంగంలో స్టార్టప్‌లు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటన్న ఆర్థిక సంవత్సరం ఇదే. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పలు ప్రముఖ స్టార్టప్ కంపెనీలు మూతపడిపోయాయి. చాలా  కంపెనీలు తమ ఉద్యోగుల్లో అత్యధిక మందిని తొలగించాయి. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితి మెరుగుపడుతోంది. ఉద్యోగాల తీసివేత దాదాపుగా 70 శాతం తగ్గిపోయింది. కొత్తగా రిక్రూట్మెంట్లను కూడా కొన్ని కంపెనీలు ప్రారంభిస్తున్నాయి. దీంతో మాంద్యం నుంచి బయటపడుతున్నామని స్టార్టప్ కంపెనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. 

ఇటీవలి కాలంలో భారీగా స్టార్టప్ కంపెనీల్లో లే ఆఫ్‌లు

ఇప్పుడు యువ టెక్ నిపుణుల కలలు స్టార్టప్‌ల మీదనే ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా పరుగులు ప్రారంభించినవారికి  ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచి ఐడియాలు అనుకున్న  స్టార్టప్‌లు కూడా ఎగుడుదిగుడులు చూశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎడ్యూటెక్ కంపెనీ అన్‌అకాడమీ తమ మార్కెటింగ్ టీమ్  మొత్తాన్ని తొలగించింది. పాకెట్ ఎఫ్‌ఎమ్  స్టార్టప్ 103 మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధిచినప్పటికీ 200  మంది రైటర్స్ ని జూలైలో ఉద్యోగాల నుంచి తొలగించింది. చెన్నైలోని అగ్రిస్టార్టప్ వే కూల్ రెండు వందల మంది ఉద్యోగుల్ని తొలగించింది. 

చిన్న పొరపాటుకు భారీ మూల్యం, రూ.382 కోట్ల ఐటీ నోటీస్‌ - మీకూ రావచ్చు!

మూతపడిపోయిన కొన్ని ప్రముఖ స్టార్టప్‌లు

ఇక మూతపడిన కంపెనీలు కూడా ఉన్నాయి. హెల్త్ స్టార్టప్ కెన్కో, ఇన్సూర్ స్టాక్.ఏఐ, ఎడ్యూటెక్ ఫ్లాట్ ఫామ్ బ్లూలెర్న్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం కూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే మనుగడ సాగించలేక చేతులు ఎత్తేశాయి. అదే సమయంలో ఉనికి సమస్యలు ఎదుర్కొంటున్న ఆకాష్ లెర్నింగ్, షేర్ చాట్, దుంజో కూడా ఉద్యోగుల్ని తొలగించాయి. మొత్తంగా 95 స్టార్టప్ కంపెనీలు పధ్నాలుగు వేల మంది ఉద్యోగుల్ని  తొలగించాయి. ఇప్పుడు ఆ తీసివేతల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. అయితే ఒక్క దేశంలోనే ఇలాంటి  ట్రెండ్ లేదు. ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది పరిస్థితి. 

పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న సూచనలు          

ఇప్పుడు తీసివేతల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో  ఇన్వెస్టర్లు కూడా ముందుకు వస్తున్నారు. సీరిస్ ఫండింగ్ కోసం స్టార్టప్‌లు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. వంద మిలియన్ డాలర్ల పైమేర పెట్టుబడులు సాధిస్తున్న కంపెనీలు కూడా ఎక్కువగా నే ఉన్నాయి. పాత రోజులు మళ్లీ వస్తాయని.. టెక్ నిపుణులు ఆశాభావంతో ఉన్నారు. 

హీరో రాజ్ తరుణ్ టూ హర్షసాయి, హైప్రొఫైల్ కేసులకు అడ్డాగా నార్సింగి పోలీస్ స్టేషన్

మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పుడు పెద్ద ఎత్తున స్టాఫ్ ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాలేజీల్లో ఇప్పటికే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ప్రారంభించాయి. గతం కన్నా ఎక్కువగా రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మాంద్యం నుంచి బయటపడుతున్న సూచనలేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.                 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Ganesh Nimajjanam: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
Chandrababu In Kuppam: కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Farmhouses Files: ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
Peddapalli Engineering Student Death: అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!
అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Ganesh Nimajjanam: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
Chandrababu In Kuppam: కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Farmhouses Files: ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
Peddapalli Engineering Student Death: అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!
అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!
Vaishnavi Chaitanya : నాకు అంత ఏజ్ రాలేదండి… 32 కాదు 25 - ఆధార్ కార్డ్ చూపించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య
నాకు అంత ఏజ్ రాలేదండి… 32 కాదు 25 - ఆధార్ కార్డ్ చూపించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య
Chief Selector Sacked: 3 ఐసీసీ ట్రోఫీలు అందించినా వేటు తప్పలేదు.. రోహిత్ తో విభేదాలు బోర్డు జోక్యంతో  అగార్కర్‌కు నిష్క్రమణ, బుమ్రా కెప్టెన్సీ నుంచే మొదలైన రచ్చ
3 ఐసీసీ ట్రోఫీలు అందించినా వేటు తప్పలేదు.. రోహిత్ తో విభేదాలు బోర్డు జోక్యంతో  అగార్కర్‌కు నిష్క్రమణ, బుమ్రా కెప్టెన్సీ నుంచే మొదలైన రచ్చ
రూ.35,000 డౌన్‌పేమెంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 రోడ్‌స్టర్ బైక్‌ను సొంత చేసుకోవచ్చు! EMI ఎంతంటే?
RE Guerrilla 450: యూత్ కలల బైక్ ఇప్పుడు మరింత చేరువలో! రూ.35,000 మీ చేతిలో ఉంటే చాలు!
Thaman Reaction : ది రాజా సాబ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి కన్నీళ్లు - నాకు ఏడుపు రాలేదంటూ తమన్ ఫన్ సెటైరికల్ రియాక్షన్
ది రాజా సాబ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి కన్నీళ్లు - నాకు ఏడుపు రాలేదంటూ తమన్ ఫన్ సెటైరికల్ రియాక్షన్
Embed widget