Startup India Scheme : స్టార్టప్ ఇండియా స్కీమ్ అదుర్స్, అంకుర సంస్థలకు భరోసా
స్టార్టప్ ఇండియా పథకంతో ఎన్నో అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. భవిష్యత్‌లో ఇంకెన్నో అంకురాలు రావటానికి ఇది తోడ్పడనుంది.
స్టార్టప్ ఇండియా పథకంతో అంకుర సంస్థలకు మంచి రోజులు
ఏటా లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటే వారిలో ఉద్యోగం దక్కుతున్న వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది. సరైన నైపుణ్యాలు లేకనో, అవకాశాలు రాకనో చాలా మంది ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. ఫలితంగా నిరుద్యోగ రేటు ఏటా పెరుగుతూ పోతోంది. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతానికి భారత్‌లో నిరుద్యోగ రేటు 7.3%గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రానురాను ఈ శాతం మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల్లోనూ నియామకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఇదంతా నాణానికి ఓ వైపు. మరో వైపు చూస్తే భారత్‌లో ఉద్యోగ కల్పన ఊపందుకుంటోందని స్పష్టమవుతోంది. స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా భారత్‌లో అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి.
యునికార్న్ జాబితాలో 100 భారతీయ సంస్థలు
2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది భారత్. అప్పటికి దేశంలో నిరుద్యోగ రేటు 5.51%గా నమోదైంది. స్టార్టప్ ఇండియా పథకం అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 7 లక్షల మందికిపైగా ఉపాధి దొరికినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 30 అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఇక్కడ రోజుకు కనీసం 6 అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. తద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద రెండో స్టార్టప్ ఇకోసిస్టమ్‌గా ఎదుగుతోంది భారత్. 2016-22 మధ్య కాలంలో 69,895 అంకుర సంస్థలు ఏర్పాటు కాగా, 7లక్షలమందికిపైగా ఉపాధి లభించింది. 8 వేలకుపైగా స్టార్టప్‌లతో ఐటీ విభాగం మొదటి స్థానంలో ఉండగా...హెల్త్‌కేర్ విభాగం రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ రంగ అంకుర సంస్థలు మాత్రం పెద్దగా కనిపించటం లేదు. ఏడాదిలో కోటి ఉద్యోగాలు సృష్టించాలంటే కనీసం 10 లక్షల అంకుర సంస్థలు ఏర్పాటవ్వాల్సిన అవసరముంది. ఇప్పటికే యునికార్న్ జాబితాలో భారత్‌కు చెందిన 100 సంస్థలున్నాయి. ఈ సంఖ్య పెంచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విభాగం |
గుర్తింపు పొందిన అంకుర సంస్థలు |
ఉద్యోగాలు |
ఐటీ సర్వీసెస్ |
8,280 |
98,207 |
హెల్త్ కేర్&లైఫ్ సైన్సెస్ |
6,098 |
66,086 |
విద్య |
4,386 |
46,323 |
ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ |
3,268 |
42,880 |
ఫుడ్ అండ్ బేవరేజెస్ |
3,002 |
37,257 |
ఫైనాన్స్ టెక్నాలజీ |
2,059 |
28,123 |
నిర్మాణం |
2,292 |
27,093 |
వ్యవసాయం |
3,026 |
25,833 |
మానవ వనరులు |
1,248 |
25,401 |
టెక్నాలజీ హార్డ్‌వేర్ |
2,037 |
18,882 |
Source: Startup India (Data till May 17, 2022)
రాష్ట్రాల్లో అంకుర సంస్థల వివరాలు
రాష్ట్రం |
గుర్తింపు పొందిన అంకుర సంస్థలు |
రోజుకు ఏర్పాటవుతున్న అంకుర సంస్థలు |
మహారాష్ట్ర |
12,960 |
6 |
కర్ణాటక |
8,593 |
4 |
దిల్లీ |
8,322 |
4 |
ఉత్తర్ ప్రదేశ్ |
6,343 |
3 |
గుజరాత్ |
4,662 |
2 |
హరియాణా |
3,829 |
2 |
తమిళనాడు |
3,764 |
2 |
తెలంగాణ |
3,696 |
2 |
Source: Startup India (Data till May 17, 2022)
రోజుకు కనీసం ఒక్క స్టార్టప్‌నైనా ఏర్పాటు చేస్తున్న రాష్ట్రాల వివరాలు
రాష్ట్రం |
గుర్తింపు పొందిన అంకుర సంస్థలు |
రోజుకు ఏర్పాటవుతున్న అంకుర సంస్థలు |
కేరళ |
3,152 |
1 |
రాజస్థాన్ |
2,194 |
1 |
పశ్చిమ బెంగాల్ |
2,170 |
1 |
మధ్యప్రదేశ్ |
1,990 |
1 |
ఒడిశా |
1,280 |
1 |
బిహార్ |
1,177 |
1 |