అన్వేషించండి

SSC New Website: 'స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌'కు కొత్త వెబ్‌సైట్‌ - మళ్లీ OTR ప్రక్రియ పూర్తి చేయాల్సిందే!

SSC: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. పాత యూఆర్‌ఎల్ స్థానంలో కొత్త యూఆర్‌ఎల్‌ను తీసుకొచ్చింది.

SSC Launches New Website: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. పాత యూఆర్‌ఎల్ స్థానంలో కొత్త యూఆర్‌ఎల్‌ను తీసుకొచ్చింది. గతంలో ఉన్న వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ స్థానంలో.. కొత్త ముఖంతో, కొత్త యూఆర్‌ఎల్‌తో ఫిబ్రవరి 17 నుంచి కొత్త  వెబ్‌సైట్‌ను వినియోగంలోకి తెచ్చింది. దీంతో అభ్యర్థులందరూ కొత్త వెబ్‌సైట్ https://ssc.gov.in లో వన్‌టైం రిజిస్ట్రేషన్(OTR)ను చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

పాత వెబ్‌సైట్ https://ssc.nic.in లో ఓటీఆర్ సమర్పణకు అవకాశం ఉండదని స్పష్టంచేసింది. తాజాగా వచ్చే ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తులు, అడ్మిట్ కార్డులు, పరీక్ష కీ, ఫలితాలు.. ఇలా కేంద్ర ప్రభుత్వ కొలువులకు సంబంధించిన సమస్త సమాచారమంతా కొత్త వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేర్కొంది. ఇక నుంచి విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అంతా కొత్త వెబ్‌సైట్ ద్వారానే జరుగనున్నాయి.

2024 సంవత్సరంలో ఇప్పటికే నీట్, జేఈఈ, సీయూఈటీ-పీజీ, యూజీసీ నెట్ కొత్త వెబ్‌సైట్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కొత్త వెబ్‌సైట్‌ను కొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది.

కొత్త వెబ్‌సైట్‌లో OTR (వన్‌టైమ్ రిజిస్ట్రేషన్) ఇలా..

➥ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు మొదట ssc.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

➥ అక్కడ హోంపేజీలో 'Login/Register' ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే లాగిన్ వివరాలకు సంబంధించిన ఒక విండో ఓపెన్ అవుతుంది. 

➥ ఆ కొత్త విండోలో కింద 'Register Now' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగానే వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) లింక్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత 'Continue' పై క్లిక్ చేయాలి.

➥ అందులో అభ్యర్థులు తమ ఆధార్ కార్డు నంబర్, గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, పదోతరగతిలో చదివిన బోర్డు, రోల్ నంబర్, పాసైన సంవత్సరం, విద్యార్హతలు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలన్నింటినీ నమోదు చేయాలి. 

➥ అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, ఈ-మెయిల్‌కు వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకున్నాక 'Save & Next' ఆప్షన్‌‌పై క్లిక్ చేస్తే అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు స్టోర్ అవుతాయి.

➥ ఇతర వివరాలను కూడా ఇచ్చిన తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.

➥ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.

➥ తొలిసారి లాగిన్ అయ్యాక.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 14 రోజుల లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే సేవ్ చేసిన వివరాలు ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. 

SSC New Website: 'స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌'కు కొత్త వెబ్‌సైట్‌ - మళ్లీ OTR ప్రక్రియ పూర్తి చేయాల్సిందే!

ALSO READ:

ఇండియన్ నేవీలో 254 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.56 వేల ప్రారంభ జీతం
ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో 254 ఖాళీలను భర్తీచేనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24న ప్రారంభంకాగా, మార్చి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget