SSC JE Result: జూనియర్ ఇంజినీర్ 'పేపర్-1' ఫలితాలు విడుదల! తర్వాతి దశకు 15,605 మంది అభ్యర్థులు అర్హత!
ఫలితాలకు సంబంధించి సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 15,605 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అదేవిధంగా ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 4533 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
కేంద్రప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్) పేపర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పేపర్-2 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో వెల్లడించింది. పేపర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాలకు సంబంధించి సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 15,605 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అదేవిధంగా ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 4533 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వివిధ కారణాల వల్ల 22 మంది అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు. వీరిలో సివిల్ విభాగంలో 20 మంది అభ్యర్థులు, ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు.
కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
List-2: JE Result (Mechanical/Electrical)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నవంబరు 14 నుంచి 16 వరకు ఆన్‌లైన్ విధానంలో దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించింది. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 30% (60 మార్కులు), ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25% (50 మార్కులు), ఇతరులకు 20% (40 మార్కులు)గా నిర్ణయించారు.
Also Read: జూనియర్ ఇంజినీర్ 'పేపర్-2' పరీక్ష తేదీ వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వంలోని 21 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నవంబరు 14 నుంచి 16 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్ష ఆన్సర్ కీని నవంబరు 24న విడుదల చేశారు. ఆన్సర్ కీపై నవంబరు 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అయితే పేపర్-1 పరీక్ష ఫలితాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. ఫలితాలను జనవరి 23న విడుదల చేసే అవకాశం ఉంది. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే పేపర్-2 పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది.
List-1:
List-2:
Also Read:
1904 కోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్లు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, జనవరి 21 నుంచి దరఖాస్తులు!
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..