By: ABP Desam | Updated at : 29 Jul 2022 10:41 AM (IST)
SSC CGL Tier-2 Admit Card
స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) టైర్-2 పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమతమ రీజియన్‌లకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ల ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీజీఎల్ టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 8 , 10 తేదీల్లో SSC CGL 2020 టైర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు. సీజీఎల్ టైర్-1 పరీక్ష ఫలితాలను జులై 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-2 పరీక్షకు హాజరుకానున్నారు.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షల ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 వంటి పోస్టులను భర్తీ చేస్తారు.
SSC CGL Tier-2 Admit Card 2021
అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
పరీక్షా విధానం..
SSC CGL టైర్-2 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షలో పేపర్-1: క్వాంటిటేటివ్ ఎబిలిటీ-100 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-2: ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్-200 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-3: స్టాటిస్టిక్స్-100 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-4: జనరల్ స్టడీస్ (ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్) విభాగాలు ఉంటాయి. అభ్యర్థులు ప్రతి పరీక్షను 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
నెగెటివ్ మార్కులు: SSC CGL టైర్-2 పరీక్షలో నెగెటివ్ మార్కులు అమలుపరుస్తారు. పేపర్-2లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు. అలాగే పేపర్-2, పేపర్-3, పేపర్-4లో ఒక్కో తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున కోత విధిస్తారు. అంటే ప్రతి రెండు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు.
Agnipath Scheme: తెలంగాణలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ముఖ్యమైన తేదీలివే!
BIS Admitcard: బీఐఎస్ పరీక్ష అడ్మిట్ కార్డులు రిలీజ్, పరీక్ష తేదీ ఇదే!
BECIL Jobs: బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.75 వేల జీతం!
TS Police: కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
GAIL Recruitment: గెయిల్‌లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!